Telugu Global
Cinema & Entertainment

మరో మంచి టైటిల్ పెట్టిన దర్శకుడు

అచ్చ తెలుగు టైటిల్స్ పెట్టడానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంటాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. అతడి సినిమాల్లో మాత్రమే కాదు, టైటిల్స్ లో కూడా తెలుగుదనం కనిపిస్తుంది. తాజాగా ఈ దర్శకుడు మరోసారి తన పంథాను చాటుకున్నాడు. తన కొత్త సినిమాకు మరో మంచి తెలుగు టైటిల్ పెట్టాడు. సతీష్ వేగేశ్న కొత్త సినిమా టైటిల్ కోతి కొమ్మచ్చి. ఇది కూడా అచ్చ తెలుగు పదమే. నిన్న తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ దర్శకుడు. […]

మరో మంచి టైటిల్ పెట్టిన దర్శకుడు
X

అచ్చ తెలుగు టైటిల్స్ పెట్టడానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంటాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. అతడి సినిమాల్లో మాత్రమే కాదు, టైటిల్స్ లో కూడా తెలుగుదనం కనిపిస్తుంది. తాజాగా ఈ దర్శకుడు మరోసారి తన పంథాను చాటుకున్నాడు. తన కొత్త సినిమాకు మరో మంచి తెలుగు టైటిల్ పెట్టాడు.

సతీష్ వేగేశ్న కొత్త సినిమా టైటిల్ కోతి కొమ్మచ్చి. ఇది కూడా అచ్చ తెలుగు పదమే. నిన్న తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ దర్శకుడు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ సినిమాలో ఇద్దరు హీరోలుంటారు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్. ఒక హీరోగా సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ నటిస్తుండగా.. మరో హీరోగా దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాంష్ నటిస్తున్నాడు.

ఇంతకుముందు మేఘాంష్ తో రాజ్ దూత్ అనే సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్లే ఈ కొత్త సినిమాను నిర్మించబోతున్నారు. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పడితే.. సెప్టెంబర్ మూడో వారం నుంచి సెట్స్ పైకి వెళ్తారు. లేదంటే అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

నా తదుపరి చిత్రంతో మిమ్మల్ని మనసారా హాయిగా నవ్వించే ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ…మా 'కోతులకు' మీ ఆశీర్వాదం ఉండాలని ఆశిస్తూ…

Publiée par Satish Vegesna sur Vendredi 28 août 2020

First Published:  30 Aug 2020 1:00 AM GMT
Next Story