Telugu Global
International

ఆకాశంలో... మూడేళ్ల పాప !

భారీ ఎత్తున జరుగుతున్న ఒక గాలిపటాల వేడుకలో… అనూహ్యంగా ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక పెద్ద కైట్ కి సంబంధించిన తాళ్లకు చుట్టుకుని మూడేళ్ల పాప సైతం గాలిపటంతో పాటు ఆకాశంలోకి ఎగిరింది.  దాదాపు వంద అడుగుల ఎత్తువరకు ఆకాశంలోకి ఎగిరిపోయిన పాప అదృష్ట వశాత్తూ చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుండి బయటపడింది. సోషల్ మీడియాలో పోస్టయిన ఈ వీడియో లక్షల వ్యూస్ తో వైరల్ గా మారింది.   తైవాన్ లోని నాన్లియావో అనే […]

ఆకాశంలో... మూడేళ్ల పాప !
X

భారీ ఎత్తున జరుగుతున్న ఒక గాలిపటాల వేడుకలో… అనూహ్యంగా ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక పెద్ద కైట్ కి సంబంధించిన తాళ్లకు చుట్టుకుని మూడేళ్ల పాప సైతం గాలిపటంతో పాటు ఆకాశంలోకి ఎగిరింది. దాదాపు వంద అడుగుల ఎత్తువరకు ఆకాశంలోకి ఎగిరిపోయిన పాప అదృష్ట వశాత్తూ చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుండి బయటపడింది.

సోషల్ మీడియాలో పోస్టయిన ఈ వీడియో లక్షల వ్యూస్ తో వైరల్ గా మారింది. తైవాన్ లోని నాన్లియావో అనే సముద్రతీర పట్టణంలో జరుగుతున్న ఓ కైట్ ఫెస్టివల్ లో అత్యంత భారీ గాలిపటాలు ఎగురవేస్తున్న సమయంలో ఒక్కసారిగా గాలి బలంగా వీచడంతో గాలిపటం చివరన ఉండే తోకవంటి తాళ్లు… పాప నడుము చుట్టూ చుట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది.

ఆకాశంలో గాలిపటానికి చుట్టుకుని చిన్నారి కనిపించడంతో ఆ వేడుకకు హాజరైన వారంతా హాహాకారాలు చేశారు. అక్కడ చేరినవారంతా వెంటనే అప్రమత్తమై గాలిపటాన్ని తమ అదుపులోకి తీసుకుని కిందకు దించారు. ముప్పయి సెకన్లపాటు పాప గాల్లో ఎగురుతూ ఉంది. చిన్నారి క్షేమంగా ఉందని చాలా కొద్దిపాటి గాయాలతో ప్రమాదం నుండి బయటపడిందని స్థానిక మీడియా పేర్కొంది.

ఈ ప్రాంతంలో బలమైన గాలులు వీస్తుండటం వలన ఆ తరువాత అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. జరిగిన సంఘటనపై మున్సిపల్ సిబ్బంది ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఇకపై అలాంటి ప్రమాదాలు జరగకుండా నివారిస్తామని… ప్రమాదానికి బాధ్యులైన వారిని కనుక్కుని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

First Published:  31 Aug 2020 7:32 AM GMT
Next Story