Telugu Global
Cinema & Entertainment

ఇంద్రగంటికి ఇష్టమైన జానర్ ఇదే

తన కెరీర్ లో మొట్టమొదటి మెయిన్ స్ట్రీమ్ మూవీగా ‘V’ సినిమాను చెప్పుకొచ్చాడు ఇంద్రగంటి. అయితే తనకు ఇష్టమైన జానర్ మాత్రం ఇది కాదంటున్నాడు. ఇంతకీ ఇంద్రగంటికి ఇష్టమైన జానర్ ఏంటి? “నాకు స్వతహాగా కామెడీ-రొమాన్స్ అంటే ఇష్టం. వాటిలో కామెడీ అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. ‘అష్టాచమ్మా’, ‘అమీతుమీ’ సినిమాలు బాగా ఎంజాయ్ చేసి తీశాను. కామెడీ రాయడం, ఆ సన్నివేశాలకు వర్క్ చేయడం బాగా ఇష్టపడతాను. నా నెక్స్ట్ మూవీ కామెడీ జానర్ లోనే […]

ఇంద్రగంటికి ఇష్టమైన జానర్ ఇదే
X

తన కెరీర్ లో మొట్టమొదటి మెయిన్ స్ట్రీమ్ మూవీగా ‘V’ సినిమాను చెప్పుకొచ్చాడు ఇంద్రగంటి. అయితే తనకు ఇష్టమైన జానర్ మాత్రం ఇది కాదంటున్నాడు. ఇంతకీ ఇంద్రగంటికి ఇష్టమైన జానర్ ఏంటి?

“నాకు స్వతహాగా కామెడీ-రొమాన్స్ అంటే ఇష్టం. వాటిలో కామెడీ అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. ‘అష్టాచమ్మా’, ‘అమీతుమీ’ సినిమాలు బాగా ఎంజాయ్ చేసి తీశాను. కామెడీ రాయడం, ఆ సన్నివేశాలకు వర్క్ చేయడం బాగా ఇష్టపడతాను. నా నెక్స్ట్ మూవీ కామెడీ జానర్ లోనే ఉంటుంది. ‘V’ లాంటి యాక్షన్-థ్రిల్లర్ తీసిన తర్వాత కచ్చితంగా కామెడీ చేయాల్సిందే.”

ఇలా తనకు ఇష్టమైన జానర్ తో పాటు, నెక్ట్స్ మూవీ డీటెయిల్స్ ను కూడా బయటపెట్టాడు ఇంద్రగంటి. వీటితో పాటు రొమాంటిక్ మూవీస్ పై కూడా స్పందించాడు. గులాబీలు, టెడ్డీబేర్లు పెట్టి కమర్షియల్ రొమాన్స్ తీయడం ఈజీనే కానీ, జెన్యూన్ రొమాన్స్ తీయడం చాలా ఛాలెంజింగ్ టాస్క్ అంటున్నాడు.

ఇక ‘V’ సినిమాకు సంబంధించి మరో కీలకమైన ఎలిమెంట్ ను బయటపెట్టాడు ఇంద్రగంటి. కొన్నేళ్ల కిందట హైదరాబాద్ లో జరిగిన 2 యదార్థ ఘటనల ఆధారంగా ‘V’ సినిమా కథ రాసుకున్నాడట. సినిమా చూసిన తర్వాత కొంతమందికి ఆ విషయం అర్థమౌతుందని చెబుతున్నాడు.

First Published:  31 Aug 2020 7:39 AM GMT
Next Story