Telugu Global
Cinema & Entertainment

ఆ హీరో రోజంతా డ్రగ్స్ తీసుకునేవాడు

ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి తన మాటలకు పదునుపెట్టింది. సుశాంత్ సింగ్ కేసు డ్రగ్స్ మలుపు తీసుకున్న నేపథ్యంలో.. బాలీవుడ్-డ్రగ్స్ మధ్య ఉన్న సంబంధాన్ని మరోసారి బయటపెట్టింది. తాజాగా ఓ జాతీయ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా.. ఓ “టాప్ స్టాప్” రోజంతా డ్రగ్స్ తీసుకున్న విషయం తనకు తెలుసని, ఎందుకంటే అప్పుడు తను అక్కడే ఉన్నానని తెలిపింది “లాస్ వెగాస్ లో షూటింగ్. ఆ టైమ్ లో ఆ బడా […]

ఆ హీరో రోజంతా డ్రగ్స్ తీసుకునేవాడు
X

ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి తన మాటలకు పదునుపెట్టింది. సుశాంత్ సింగ్ కేసు డ్రగ్స్ మలుపు తీసుకున్న నేపథ్యంలో.. బాలీవుడ్-డ్రగ్స్ మధ్య ఉన్న సంబంధాన్ని మరోసారి బయటపెట్టింది. తాజాగా ఓ జాతీయ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా.. ఓ “టాప్ స్టాప్” రోజంతా డ్రగ్స్ తీసుకున్న విషయం తనకు తెలుసని, ఎందుకంటే అప్పుడు తను అక్కడే ఉన్నానని తెలిపింది

“లాస్ వెగాస్ లో షూటింగ్. ఆ టైమ్ లో ఆ బడా హీరో ఫారిన్ గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉండేది. ప్రతి రాత్రి వాళ్లు పార్టీ చేసుకునేవారు. డ్రగ్స్ నీళ్లలా పారేది. ఎల్ఎస్డీ, కొకైన్, ఎక్టాసీ పిల్స్ ను వాళ్లు రోజూ తీసుకునేవారు. ఆ హీరో రోజంతా డ్రగ్స్ తీసుకున్న సందర్భం కూడా ఉంది. దీంతో ఓసారి అతడ్ని కోకిలాబెన్ హాస్పిటల్ లో కూడా జాయిన్ చేశారు. కానీ ఆ విషయాల్ని బయటకు రానివ్వలేదు.”

బాలీవుడ్ లో 90శాతం మంది డ్రగ్స్ వాడుతుంటారని ఆరోపిస్తోంది కంగనా. మరో పెద్ద స్టార్ కూడా కేవలం డ్రగ్స్ వాడడం వల్ల తన భార్యతో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని, తర్వాత అదే స్టార్ తనను రెండేళ్ల పాటు వాడుకొని వదిలేశాడని ఆరోపించింది కంగన. కొంతమంది బడా హీరోల సీక్రెట్స్ తనకు తెలుసని, అందుకే తనను, తన కెరీర్ ను తొక్కిపెట్టాలని వాళ్లు ఎప్పటికప్పుడు ప్లాన్స్ వేస్తుంటారని చెప్పుకొచ్చింది.

First Published:  31 Aug 2020 7:45 AM GMT
Next Story