మోడీ మన్‌కీ బాత్కు భారీగా డిస్‌లైక్‌లు
ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన మన్‌కీ బాత్ ఈసారి భారీగా డిస్‌లైక్‌లను ఎదుర్కొంది. ప్రధాని మన్‌కీ బాత్కు యూట్యూబ్‌లో నెటిజన్ల నుంచి భారీ ప్రతికూల స్పందన వచ్చింది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. స్వయంగా బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీల యూట్యూబ్ చానళ్లలోనే ఈ పరిస్థితి కనిపించడం విశేషం. 23 గంటల్లో నరేంద్రమోడీ యూట్యూబ్ చానల్లో మన్‌కీబాత్ వీడియోకు 30వేల లైక్‌లు వచ్చాయి. డిస్‌లైక్‌లు ఏకంగా 73 వేలు వచ్చాయి. బీజేపీ యూట్యూబ్ చానల్లో మన్కీబాత్కు మరింత భారీగా డిస్‌లైక్‌లు […]
బీజేపీ యూట్యూబ్ చానల్లో మన్కీబాత్కు మరింత భారీగా డిస్‌లైక్‌లు వచ్చి పడ్డాయి. 23 గంటల్లో బీజేపీ యూట్యూబ్ చానల్లో 44వేల లైక్‌లు రాగా… డిస్‌లైక్‌లు ఏకంగా మూడు లక్షల 45వేలు వచ్చాయి. ఈ స్థాయిలో ప్రతికూలత రావడం గతంలో ఎన్నడూ లేదు.
దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతున్నా, కరోనా విలయతాండవం చేస్తున్నా మోడీ మాత్రం ఎంచక్కా నెమళ్లు, కుందేళ్లతో ఫొటోలు దిగుతూ వాటిని విడుదల చేస్తున్నారు. ఈ తరహా వైఖరి నచ్చకే నెటిజన్లు ఈ స్థాయిలో ప్రతికూలంగా విరుచుకుపడ్డారా అన్న అభిప్రాయాని కొందరు వ్యక్తం చేస్తున్నారు.