Telugu Global
National

15వేల కోట్ల బకాయిలు చెల్లించిన జగన్ ప్రభుత్వం

చంద్రబాబు ప్రభుత్వం వెళ్తూ వెళ్తూ భారీగా కొత్త ప్రభుత్వంపై పెండింగ్ బిల్లులను వేసి వెళ్లింది. దాదాపు60వేల కోట్ల పెండింగ్ బిల్లులను ఉంచి వెళ్లింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడం జగన్‌ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గానే ఉంది. క్రమక్రమంగా పెండింగ్‌ బిల్లులను క్లియర్ చేస్తూ వస్తోంది. టీడీపీ ప్రభుత్వం వదిలేసి వెళ్లిన బకాయిల్లో 14వేల 936 కోట్ల రూపాయలను ప్రభుత్వం క్లియర్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఉచిత విద్యుత్‌కు సంబంధించి భారీగా బకాయి ఉండిపోగా… ఈప్రభుత్వం 8వేల 655 […]

15వేల కోట్ల బకాయిలు చెల్లించిన జగన్ ప్రభుత్వం
X

చంద్రబాబు ప్రభుత్వం వెళ్తూ వెళ్తూ భారీగా కొత్త ప్రభుత్వంపై పెండింగ్ బిల్లులను వేసి వెళ్లింది. దాదాపు60వేల కోట్ల పెండింగ్ బిల్లులను ఉంచి వెళ్లింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడం జగన్‌ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గానే ఉంది. క్రమక్రమంగా పెండింగ్‌ బిల్లులను క్లియర్ చేస్తూ వస్తోంది.

టీడీపీ ప్రభుత్వం వదిలేసి వెళ్లిన బకాయిల్లో 14వేల 936 కోట్ల రూపాయలను ప్రభుత్వం క్లియర్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఉచిత విద్యుత్‌కు సంబంధించి భారీగా బకాయి ఉండిపోగా… ఈప్రభుత్వం 8వేల 655 కోట్ల రూపాయలను చెల్లించింది. చంద్రబాబు ఆరోగ్య శ్రీకి సంబంధించిన 680 కోట్లు చెల్లించకుండా వెళ్లగా ఆ సొమ్మును వైసీపీ ప్రభుత్వం క్లియర్ చేసింది. రైతుల సున్నా వడ్డీ బకాయిలకోసం 1,150 కోట్ల రూపాయలను చెల్లించారు.

చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు, విత్తనాల సబ్సిడీ 384 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ 1880 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్లగా వాటిని క్లియర్ చేసినట్టు ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిపోయిన మిగిలిన పెండింగ్ బిల్లులనూ ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

First Published:  30 Aug 2020 11:35 PM GMT
Next Story