Telugu Global
National

ఏపీకి 4.25కోట్ల అదనపు పని దినాలు కేటాయింపు

కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖతో ఏపీ ప్రభుత్వాధికారుల చర్చలు ఫలించాయి. ఏపీకి అదనంగా ఉపాధి హామీ పనిదినాలు కేటాయించాలన్న ఏపీ విజ్ఞప్తికి కేంద్రం ఓకే చెప్పింది. ఈ ఏడాదికి 21 కోట్ల పనిదినాలను ఏపీకి కేటాయించగా… లాక్‌డౌన్ సమయంలో పేదలకు ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా గత ఐదు నెలల్లో భారీగా ఉపాధి పని దినాలను ఏపీ ప్రభుత్వం వాడుకుంది. 20కోట్ల 15 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. కేవలం 85 లక్షల పనిదినాలు మాత్రమే మిగిలాయి. ఈనేపథ్యంలో కరోనా పరిస్థితులను పరిగణలోకి […]

ఏపీకి 4.25కోట్ల అదనపు పని దినాలు కేటాయింపు
X

కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖతో ఏపీ ప్రభుత్వాధికారుల చర్చలు ఫలించాయి. ఏపీకి అదనంగా ఉపాధి హామీ పనిదినాలు కేటాయించాలన్న ఏపీ విజ్ఞప్తికి కేంద్రం ఓకే చెప్పింది.

ఈ ఏడాదికి 21 కోట్ల పనిదినాలను ఏపీకి కేటాయించగా… లాక్‌డౌన్ సమయంలో పేదలకు ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా గత ఐదు నెలల్లో భారీగా ఉపాధి పని దినాలను ఏపీ ప్రభుత్వం వాడుకుంది. 20కోట్ల 15 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. కేవలం 85 లక్షల పనిదినాలు మాత్రమే మిగిలాయి.

ఈనేపథ్యంలో కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అదనపు పనిదినాలను కల్పించాలని ఏపీ కోరింది. ఈ సమయంలోనే ఉపాధి హామీపై కేంద్రానికి టీడీపీ పలు ఫిర్యాదులు చేసింది. అయినప్పటికీ ఏపీ అధికారుల చర్చలు ఫలించాయి. అదనంగా 4.25కోట్ల పనిదినాలను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది. అవసరమైతే ఆర్థిక ఏడాది ఆఖరిలో మరోసారి అదనపు పనిదినాలు కల్పిస్తామని ఏపీకి కేంద్రం హామీ ఇచ్చింది.

First Published:  31 Aug 2020 11:17 PM GMT
Next Story