Telugu Global
National

కరోనా ఎఫెక్ట్‌... పెరిగిన మారుతీ కార్ల సేల్స్‌ !

కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడింది. కొన్ని రంగాలు కుదేలయ్యాయి. సంక్షోభంలో ఉన్న ఆటోమొబైల్‌ రంగానికి మాత్రం కరోనా కొంత బూస్ట్‌ ఇచ్చింది. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించడంతో అందరూ ప్రైవేటు వెహికల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. సొంత వెహికల్‌ ఉంటే బెటర్‌ అని కొంతమంది అనుకుంటున్నారు. దీంతో లాక్‌డౌన్‌ తర్వాత కార్ల కొనుగోలుపై దృష్టిపెట్టారు. ఇదే విషయాన్ని మారుతీ కార్ల అమ్మకం కూడా చెబుతోంది. 2020 జూలై నెలలో లక్షా 24వేల 624 మారుతీ కార్లు అమ్ముడుపోయాయి. 2019 అమ్మకాలతో […]

కరోనా ఎఫెక్ట్‌... పెరిగిన మారుతీ కార్ల సేల్స్‌ !
X

కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడింది. కొన్ని రంగాలు కుదేలయ్యాయి. సంక్షోభంలో ఉన్న ఆటోమొబైల్‌ రంగానికి మాత్రం కరోనా కొంత బూస్ట్‌ ఇచ్చింది. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించడంతో అందరూ ప్రైవేటు వెహికల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. సొంత వెహికల్‌ ఉంటే బెటర్‌ అని కొంతమంది అనుకుంటున్నారు. దీంతో లాక్‌డౌన్‌ తర్వాత కార్ల కొనుగోలుపై దృష్టిపెట్టారు. ఇదే విషయాన్ని మారుతీ కార్ల అమ్మకం కూడా చెబుతోంది.

2020 జూలై నెలలో లక్షా 24వేల 624 మారుతీ కార్లు అమ్ముడుపోయాయి. 2019 అమ్మకాలతో పోలిస్తే17.1 శాతం వృద్ధి నమోదు అయింది. గత ఏడాది ఇదే టైమ్‌లో లక్షా 6వేల 413 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. జూన్‌లో కేవలం 57వేల 428 కార్లు మాత్రమే సేల్స్ అయ్యాయి.

కరోనా లాక్‌డౌన్‌తో మార్చిలో కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. పూర్తిగా ప్లాంట్‌ కార్యకలాపాలు ఆపేసింది. ఏప్రిల్‌లో కూడా పూర్తిగా మూసివేసింది. మే నెలలో పాక్షికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. మే, జూన్‌లో మెల్లమెల్లగా ఉత్పత్తిని పెంచింది. ఆగస్ట్‌లో దేశీయంగా కార్ల అమ్మకాలు పెరిగాయి. 21.3 శాతం వృద్ధి నమోదు అయింది.

మారుతీ ఎంట్రీ లెవల్‌ కార్లు అయిన అల్టో, ఎస్‌ ప్రెసో బాగా అమ్ముడవుతున్నాయి. ఆ తర్వాత వాగన్‌ ఆర్‌, స్విప్ట్‌, సెలిరో, ఇగ్నిస్‌, బెలనో, డిజైర్‌ మోడల్స్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

First Published:  1 Sep 2020 2:46 AM GMT
Next Story