Telugu Global
Cinema & Entertainment

మెలొడీ బ్రహ్మ ఖాతాలో మరో బడా ప్రాజెక్టు?

“ఇస్మార్ట్ శంకర్” సినిమా ఎంతో మందికి బ్రేక్ ఇచ్చింది. అందులో ఒక వ్యక్తి మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ. ఆ సినిమాతో “మణి కెరీర్ 2.O” మొదలైంది. ఇప్పుడు ఏకంగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాకు సంగీతం అందించే స్థాయికి మళ్లీ వచ్చేశాడు మణిశర్మ. అలా కెరీర్ లో మరోసారి పీక్ స్టేజ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ సంగీత దర్శకుడు, ఇప్పుడు ఇంకో బిగ్ ప్రాజెక్టుకు మ్యూజిక్ అందించే అవకాశానికి అడుగు దూరంలో ఉన్నాడు. అవును.. […]

మెలొడీ బ్రహ్మ ఖాతాలో మరో బడా ప్రాజెక్టు?
X

“ఇస్మార్ట్ శంకర్” సినిమా ఎంతో మందికి బ్రేక్ ఇచ్చింది. అందులో ఒక వ్యక్తి మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ. ఆ సినిమాతో “మణి కెరీర్ 2.O” మొదలైంది. ఇప్పుడు ఏకంగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాకు సంగీతం అందించే స్థాయికి మళ్లీ వచ్చేశాడు మణిశర్మ. అలా కెరీర్ లో మరోసారి పీక్ స్టేజ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ సంగీత దర్శకుడు, ఇప్పుడు ఇంకో బిగ్ ప్రాజెక్టుకు మ్యూజిక్ అందించే అవకాశానికి అడుగు దూరంలో ఉన్నాడు.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే అల్లు అర్జున్ కొత్త సినిమాకు మణిశర్మ సంగీతం అందించే ఛాన్స్ ఉంది. రీసెంట్ గా కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు బన్నీ. ఈ ప్రాజెక్టుకు సంగీత దర్శకుడిగా మణిశర్మను అనుకుంటున్నారు.

ప్రస్తుతం కొరటాల, మణిశర్మతోనే వర్క్ చేస్తున్నాడు కాబట్టి.. తన నెక్ట్స్ సినిమాకు కూడా అతడ్నే రిపీట్ చేసే అవకాశాలున్నాయి.

ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఎంతోమంది హీరోలతో వర్క్ చేసి, వాళ్లకు సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన మణిశర్మ.. బన్నీతో మాత్రం పెద్దగా వర్క్ చేయలేకపోయాడు. అప్పుడెప్పుడో పదేళ్ల కిందటొచ్చిన “వరుడు” సినిమా తర్వాత మళ్లీ బన్నీతో కలిసి వర్క్ చేసే అవకాశం రాలేదు ఈ సీనియర్ సంగీత దర్శకుడికి. అంతకంటే ముందు “పరుగు” అనే సినిమా వచ్చింది. బన్నీ-మణి కాంబోలో వచ్చిన సినిమాలు ఈ రెండే.

First Published:  31 Aug 2020 7:30 PM GMT
Next Story