Telugu Global
National

సుశాంత్ తన సోదరితో యాంగ్జయిటీ గురించి చెప్పాడా?!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు… అనేక మలుపులు తిరుగుతూ ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం తెరపైకి వస్తోంది. సుశాంత్ మరణానికి ఆరురోజుల ముందు అతని సోదరి ప్రియాంకతో తనకున్న యాంగ్జయిటీ గురించి మెసేజ్ ల్లో చెప్పాడని, ఆమె ద్వారా యాంగ్జయిటీకి ఏ మందులు వాడాలో తెలుసుకున్నాడని సిబిఐ విచారణలో తేలింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ సైతం ఇదే విషయాన్ని చెబుతోంది. సుశాంత్ సోదరి ప్రియాంక సుప్రీంకోర్టు లాయరు. […]

సుశాంత్ తన సోదరితో యాంగ్జయిటీ గురించి చెప్పాడా?!
X

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు… అనేక మలుపులు తిరుగుతూ ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం తెరపైకి వస్తోంది. సుశాంత్ మరణానికి ఆరురోజుల ముందు అతని సోదరి ప్రియాంకతో తనకున్న యాంగ్జయిటీ గురించి మెసేజ్ ల్లో చెప్పాడని, ఆమె ద్వారా యాంగ్జయిటీకి ఏ మందులు వాడాలో తెలుసుకున్నాడని సిబిఐ విచారణలో తేలింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ సైతం ఇదే విషయాన్ని చెబుతోంది. సుశాంత్ సోదరి ప్రియాంక సుప్రీంకోర్టు లాయరు.

సిబిఐ చెబుతున్న వివరాలను బట్టి… సుశాంత్ తన సోదరికి తన సమస్యని వివరిస్తూ మెసేజ్ చేసి … డాక్టరు ప్రిస్ర్కిప్షన్ లేకుండా మందులు ఇవ్వరు కదా అనే సందేహం వ్యక్తం చేశాడు. నేను మేనేజ్ చేస్తాను… అని ప్రియాంక చెప్పింది. తరువాత ఢిల్లీనుండి డాక్టరు రాసిన మందుల చీటిని సుశాంత్ కి పంపింది ప్రియాంక.

ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో గుండెవ్యాధుల నిపుణుడైన డాక్టర్ తరుణ్ కుమార్ సంతకంతో స్టాంపుతో ఆ మందుల చీటి ఉంది. దానిపైన ఉన్న తేదీ జూన్ 8. ఆ రోజు సుశాంత్ ముంబయిలోనే ఉన్నాడు. అదే రోజు రియా అతని ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోయింది.

సుశాంత్ అతని సోదరి ప్రియాంక మధ్య జరిగిన చాటింగ్ లో… ప్రియాంక ఒకరకం మందులు వారం పాటు వేసుకుని తరువాత మరొక మందు వాడమని సలహా ఇచ్చింది. ఒకరకం మందులను ఎప్పుడూ దగ్గర ఉంచుకోమని, యాంగ్జయిటీ ఎటాక్ వస్తే వేసుకోమని సుశాంత్ కి సూచించింది. ఢిల్లీలో ఉన్న తన ఫ్రెండ్ ఒకరు మంచి డాక్టరు అని… ఆ వ్యక్తి ముంబయిలో ఓ మంచి డాక్టరుని సుశాంత్ కి పరిచయం చేస్తారని… ఇదంతా ఎవరికీ తెలియకుండా జరుగుతుందని, భయపడవద్దని కూడా ఆమె సుశాంత్ కి చెప్పింది.

వీరి మధ్య చాటింగ్ మొత్తం జూన్ 8వ తేదీన ఉదయం నాలుగున్నర ఐదున్నర మధ్యలో సాగింది. ఏడు గంటలకు ప్రియాంక ఢిల్లీ డాక్టరు రాసిన మందుల చీటి స్కానింగ్ కాపీని సుశాంత్ కి పంపింది. అది ఢిల్లీనుండి వచ్చిన ప్రిస్ర్కిప్షన్ అయినప్పటికీ ఏ సమస్యా ఉండదని… ఆన్ లైన్ ద్వారా డాక్టరుని సంప్రదించినట్టుగా చెప్పవచ్చని కూడా ఆమె సుశాంత్ తో చెప్పింది.

రియా చక్రవర్తి తరపున వాదిస్తున్న న్యాయవాది సతీష్ మనేషిండే… సుశాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి అతని కుటుంబానికి ముందే తెలుసునని చెబుతుండగా… సుశాంత్ తండ్రి మొదటినుండీ తమ కొడుక్కి మానసిక అనారోగ్యం ఉన్నట్టుగా తమకు తెలియదని, రియానే అతను అధిక మోతాదులో మందులు వాడేలా చేసిందని చెబుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ అంశాలేవీ తమకు ఆటంకంగా మారబోవని సుశాంత్ కుటుంబం తరపున వాదిస్తున్న న్యాయవాది వికాస్ సింగ్ అంటున్నారు. సుశాంత్ కి మానసిక సమస్యలున్న సంగతి నిజంగానే కుటుంబ సభ్యులకు తెలియదని, అతను యాంగ్జయిటీ గురించి తన సోదరితో చెప్పాడని, లాక్ డౌన్ కావటం వలన ఆమె ఢిల్లీ నుండి ఏ మందులు వాడాలో తెలియజేసిందని…అంతకుమించి ఏమీలేదని చెబుతున్నాడతను.

First Published:  1 Sep 2020 2:48 AM GMT
Next Story