Telugu Global
National

రాయలసీమ పథకంలో జోక్యం చేసుకోలేం...

రాయలసీమ ఎత్తిపోతల పథకంలో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇది రెండు రాష్ట్రాల మధ్య అంశమని… అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశిస్తుందని కోర్టు ప్రశ్నించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు… ఇందులో తాము చేయగలిగింది ఏమీ లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. […]

రాయలసీమ పథకంలో జోక్యం చేసుకోలేం...
X

రాయలసీమ ఎత్తిపోతల పథకంలో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇది రెండు రాష్ట్రాల మధ్య అంశమని… అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశిస్తుందని కోర్టు ప్రశ్నించింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు… ఇందులో తాము చేయగలిగింది ఏమీ లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకునే పరిధి తెలంగాణ హైకోర్టుకు ఉందని టీఎస్‌ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదించగా… ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశిస్తుందని న్యాయమూర్తి ప్రశ్నించారు.

ఎత్తిపోతల పథకానికి టెండర్లు నిర్వహించేందుకు కూడా ఎన్‌జీటీ అనుమతి ఇచ్చిందని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌జీటీ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని కోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది.

ఈ అంశం ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు ఉందని…. కాబట్టి సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు వేచిచూడాలని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం కోరారు. ఇందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరిస్తూ విచారణను నిరవధికంగా వాయిదా వేసింది.

First Published:  1 Sep 2020 5:15 AM GMT
Next Story