Telugu Global
Cinema & Entertainment

ఓటీటీలోకి మాజీ హీరోయిన్

పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది హీరోయిన్ స్వాతి. తెలుగులో ఆమె చేసిన లాస్ట్ మూవీ “లండన్ బాబులు”. ఆ తర్వాత పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కు పరిమితమైన ఈ హీరోయిన్ ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అవుతోంది. అయితే అది సినిమాల్లో కాదు. త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది స్వాతి. నిజానికి సినిమాలతో రీ-ఎంట్రీ ఇవ్వాలని భావించింది స్వాతి. నిఖిల్ హీరోగా రాబోతున్న “కార్తికేయ-2″లో ఓ చిన్న కీలకమైన పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు. అయితే ఆ సినిమా […]

ఓటీటీలోకి మాజీ హీరోయిన్
X

పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది హీరోయిన్ స్వాతి. తెలుగులో ఆమె చేసిన లాస్ట్ మూవీ “లండన్ బాబులు”. ఆ తర్వాత పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కు పరిమితమైన ఈ హీరోయిన్ ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అవుతోంది. అయితే అది సినిమాల్లో కాదు. త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది స్వాతి.

నిజానికి సినిమాలతో రీ-ఎంట్రీ ఇవ్వాలని భావించింది స్వాతి. నిఖిల్ హీరోగా రాబోతున్న “కార్తికేయ-2″లో ఓ చిన్న కీలకమైన పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు. అయితే ఆ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా టైం ఉంది.

ఈ గ్యాప్ లో ఓటీటీలో ఓ ఒరిజినల్ మూవీ చేసేందుకు రెడీ అవుతోంది స్వాతి. అది కూడా ఇండస్ట్రీలో ఓ మెయిన్ స్ట్రీమ్ దర్శకుడితోనే ఆ ఒరిజినల్ మూవీ రాబోతోందంటూ ఫీలర్లు వదులుతోంది. ఆ దర్శకుడు ఎవరు, అది ఏ ఓటీటీ లాంటి వివరాల్ని మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంచింది.

First Published:  2 Sep 2020 3:28 AM GMT
Next Story