Telugu Global
Cinema & Entertainment

పవన్-క్రిష్ మూవీ ప్రీ-లుక్ రిలీజ్

పవన్ పుట్టినరోజు సందర్భంగా అతడు నటిస్తున్న కొత్త సినిమా నుంచి ఈరోజు ప్రీ-లుక్ రిలీజ్ చేశారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ ప్రీ-లుక్ ను కొద్దిసేపటి కిందట విడుదల చేశారు. మొఘల్ కాలం బ్యాక్ డ్రాప్ తో ఫిక్షన్ కథతో వస్తోంది ఈ సినిమా. ఇందులో పవన్ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. దానికి సూచనగా ఈరోజు రిలీజ్ చేసిన ప్రీలుక్ లో చేతికి కడియం, వేలికి ఉంగరం, […]

పవన్-క్రిష్ మూవీ ప్రీ-లుక్ రిలీజ్
X

పవన్ పుట్టినరోజు సందర్భంగా అతడు నటిస్తున్న కొత్త సినిమా నుంచి ఈరోజు ప్రీ-లుక్ రిలీజ్ చేశారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ ప్రీ-లుక్ ను కొద్దిసేపటి కిందట విడుదల చేశారు.

మొఘల్ కాలం బ్యాక్ డ్రాప్ తో ఫిక్షన్ కథతో వస్తోంది ఈ సినిమా. ఇందులో పవన్ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. దానికి సూచనగా ఈరోజు రిలీజ్ చేసిన ప్రీలుక్ లో చేతికి కడియం, వేలికి ఉంగరం, నడుము చుట్టూ ఎర్రటి గుడ్డ, దానిపై ఓ గద్ద బొమ్మ, ఇక ముఖానికి ఎర్ర కండువా చుట్టుకున్న స్టిల్ ను విడుదల చేశారు. ఈ ఎలిమెంట్స్ అన్నీ చూస్తుంటే.. పవన్ లుక్ కచ్చితంగా కొత్తగా ఉంటుందనే విషయం తెలుస్తూనే ఉంది.

మరోవైపు ఈ ప్రీ-లుక్ తో పుకార్లకు చెక్ పెట్టాడు క్రిష్. ఈ సినిమా ఆగిపోయిందంటూ కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రీ-లుక్ రిలీజ్ చేసి సినిమా పైప్ లైన్లోనే ఉందని పరోక్షంగా ప్రకటించాడు క్రిష్. మూవీకి సంబంధించి 15 రోజుల షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ ట్వీటాడు.

First Published:  2 Sep 2020 3:17 AM GMT
Next Story