Telugu Global
Cinema & Entertainment

గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్లీ ఫిక్స్

పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆల్రెడీ కమిట్ అయిన హరీష్ శంకర్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా ఈ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించి ఈరోజు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఓ స్టయిలిష్ బైక్ పెట్టి, దానిపై పెద్ద బాలశిక్ష పుస్తకం పెట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అంతేకాదు.. బ్యాక్ డ్రాప్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఫొటోల్ని […]

గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్లీ ఫిక్స్
X

పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆల్రెడీ కమిట్ అయిన హరీష్ శంకర్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా ఈ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించి ఈరోజు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఓ స్టయిలిష్ బైక్ పెట్టి, దానిపై పెద్ద బాలశిక్ష పుస్తకం పెట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అంతేకాదు.. బ్యాక్ డ్రాప్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఫొటోల్ని కూడా పెట్టారు. సినిమా ఎప్పట్నుంచి సెట్స్ పైకి వస్తుందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కథ పూర్తిచేసినట్టు హరీష్ ప్రకటించాడు. 60శాతం డైలాగ్ వెర్షన్ కూడా పూర్తయినట్టు తెలిపాడు. తనకు ఇంకా చాలా టైమ్ ఉందని, ఈ గ్యాప్ లో మిగతా పని పూర్తిచేస్తానంటున్నాడు.

First Published:  2 Sep 2020 7:19 AM GMT
Next Story