Telugu Global
Cinema & Entertainment

పవన్ నుంచి మరో సినిమా ప్రకటన

పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరో సినిమా ప్రకటన వచ్చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఈరోజు పరోక్షంగా వెల్లడించారు. పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నిర్మాత రామ్ తళ్లూరి ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. అందులో తన బ్యానర్ లోగో వేశాడు. శుభాకాంక్షలు చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, అదే పోస్టర్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి ఫొటో కూడా వేశాడు. సురేందర్ తో కలిసి […]

పవన్ నుంచి మరో సినిమా ప్రకటన
X

పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరో సినిమా ప్రకటన వచ్చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఈరోజు పరోక్షంగా వెల్లడించారు.

పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నిర్మాత రామ్ తళ్లూరి ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. అందులో తన బ్యానర్ లోగో వేశాడు. శుభాకాంక్షలు చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, అదే పోస్టర్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి ఫొటో కూడా వేశాడు. సురేందర్ తో కలిసి జాయింట్ గా శుభాకాంక్షలు చెప్పాడు.

దీంతో రామ్ తళ్లూరి బ్యానర్ పై పవన్-సురేందర్ కాంబోలో సినిమా రాబోతోందనే విషయం పక్కా అయింది. నిజానికి ఈ కాంబినేషన్ పై కొన్ని రోజులుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఆ పుకార్లపై ఈరోజు ఓ క్లారిటీ వచ్చినట్టయింది.

సినిమా ప్రకటన అయితే వచ్చింది కానీ అది సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది. ఎందుకంటే పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ చేస్తున్నాడు. అది పూర్తవ్వాలి. దాని తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తవ్వాలి. ఆ తర్వాత హరీష్ శంకర్ మూవీ లైన్లో ఉంది. ఇవన్నీ కంప్లీట్ అయితే తప్ప సురేందర్ మూవీ సెట్స్ పైకి రాదు.

First Published:  2 Sep 2020 3:30 AM GMT
Next Story