Telugu Global
National

రైతుల్ని రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్న చంద్రబాబు...

కరోనా కారణంగా హైదరాబాద్ లో ఉండిపోయిన చంద్రబాబు.. చాలారోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టారు. వస్తూ వస్తూనే నా రాజధాని ఏది? నా అమరావతికి ఏమైంది..? అంటూ రైతుల వద్దకు వెళ్లి సంఘీభావం తెలుపుతారని అనుకున్నారంతా. కానీ ఆయన ఆ పనిచేయలేదు, అసలాయన షెడ్యూల్ లో అమరావతి లేనే లేదు. నేరుగా పార్టీ నేతల్ని కలుసుకున్నారు, ప్రభుత్వం కక్షసాధిస్తోందంటూ మండిపడ్డారు. కనీసం అమరావతి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజధానికోసం పోరాడండి, రాష్ట్ర ప్రజలంతా ఏకం కండి, […]

రైతుల్ని రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్న చంద్రబాబు...
X

కరోనా కారణంగా హైదరాబాద్ లో ఉండిపోయిన చంద్రబాబు.. చాలారోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టారు. వస్తూ వస్తూనే నా రాజధాని ఏది? నా అమరావతికి ఏమైంది..? అంటూ రైతుల వద్దకు వెళ్లి సంఘీభావం తెలుపుతారని అనుకున్నారంతా. కానీ ఆయన ఆ పనిచేయలేదు, అసలాయన షెడ్యూల్ లో అమరావతి లేనే లేదు.

నేరుగా పార్టీ నేతల్ని కలుసుకున్నారు, ప్రభుత్వం కక్షసాధిస్తోందంటూ మండిపడ్డారు. కనీసం అమరావతి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

రాజధానికోసం పోరాడండి, రాష్ట్ర ప్రజలంతా ఏకం కండి, ప్రజా ఉద్యమాలు చేయండి అంటూ ఆమధ్య హడావిడి చేసిన చంద్రబాబుకి ఇప్పుడేమైంది? జోలెపట్టి అమరావతి ఉద్యమంకోసం ఊరూరా చందాలు వసూలు చేసిన చంద్రబాబు ఇప్పుడా విషయంలో మౌనాన్నే ఆశ్రయించారు.

అమరావతికోసం వెళ్తే.. మిగతా ప్రాంతాల్లో వస్తున్న వ్యతిరేకతతో చంద్రబాబు అస్త్ర సన్యాసం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలారా రాజీనామాలు చేయండి, దమ్ముంటే మూడు రాజధానుల అజెండాతో తిరిగి పోటీ చేయండి అంటూ సవాళ్లు విసిరిన బాబు పూర్తిగా ఆ ట్రాన్స్ లోనుంచి బైటకు వచ్చేసినట్టు అర్థమవుతోంది.

అందుకే అమరావతిపై కన్నెత్తి కూడా చూడకుండా జైలుకెళ్లొచ్చిన మాజీ మంత్రుల్ని పరామర్శించడం వరకే తన ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు. పోనీ అమరావతివైపు వెళ్తే ప్రభుత్వం చంద్రబాబుని అడ్డుకుంటుందా, ఆంక్షలేమైనా విధించిందా అంటే అదీ లేదు. అమరావతి విషయంలో చంద్రబాబు తన గొయ్యి తానే తీసుకునే వరకు సీఎం జగన్ వేచి చూశారు. ఇప్పుడా గోతిలోనుంచి ఎలా బైటపడాలో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నారు.

మొత్తమ్మీద చంద్రబాబు విజయవంతంగా అమరావతి విషయాన్ని పక్కనపెట్టేశారని తాజా పర్యటనతో మరోసారి రుజువైంది. రైతుల్ని రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్నారని నిర్థారణ అయింది.

First Published:  2 Sep 2020 10:17 PM GMT
Next Story