Telugu Global
National

మోదీ ట్విట్టర్‌ హ్యాక్... విరాళం కోసమే చేశారా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. జాన్‌ విక్‌ పేరుతో ప్రధాని మోదీ అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. క్రిప్టో కరెన్సీ ద్వారా పీఎం సహాయ నిధికి విరాళం ఇవ్వాలని హ్యాకర్లు ట్విట్టర్‌లో కోరారు . విరాళాల కోసం మోదీ పేరుతో హ్యాకర్లు వరుస ట్వీట్లు చేశారు. ఇటీవలే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్తాన్‌కు చెందిన దుండగులు హ్యాక్‌ చేశారు. […]

మోదీ ట్విట్టర్‌ హ్యాక్... విరాళం కోసమే చేశారా?
X

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. జాన్‌ విక్‌ పేరుతో ప్రధాని మోదీ అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. క్రిప్టో కరెన్సీ ద్వారా పీఎం సహాయ నిధికి విరాళం ఇవ్వాలని హ్యాకర్లు ట్విట్టర్‌లో కోరారు . విరాళాల కోసం మోదీ పేరుతో హ్యాకర్లు వరుస ట్వీట్లు చేశారు.

ఇటీవలే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్తాన్‌కు చెందిన దుండగులు హ్యాక్‌ చేశారు. కేంద్ర మంత్రి కాకముందు ఈ వెబ్‌సైట్‌ను తన స్థానిక ఈవెంట్ల కవరేజీ కోసం ఆయన వినియోగించేవారు. కేంద్ర మంత్రి అయ్యాక ఈ వెబ్‌సైట్‌ను అంతగా వినియోగించడం లేదు. వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసిన హ్యాకర్లు అందులో భారతదేశంపై దూషణలు చేశారు. హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే పాకిస్తాన్‌, హ్యాక్డ్‌ బై మిస్టర్‌ హెచ్‌ఏకే, పాకిస్తాన్‌ జిందాబాద్‌ అనే శీర్షికను రాశారు. మా కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు సెల్యూట్‌… అంటూ భారతదేశాన్ని దూషించారు.

ఇక ఇప్పుడు ప్రధాని మోదీ అకౌంట్‌ హ్యాక్‌పై అప్రమత్తమైన ట్విట్టర్‌ టీమ్‌ దర్యాప్తు చేస్తోంది. తాజాగా చైనాతో సరిహద్దు వివాదం, 118 యాప్స్‌ను బ్యాన్‌ చేసింది భారత్‌. ఈ నేపథ్యంలో అకౌంట్‌ హ్యాక్‌ వెనుక చైనా లేదంటే పాకిస్తాన్‌ హస్తముందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

First Published:  2 Sep 2020 9:53 PM GMT
Next Story