Telugu Global
Cinema & Entertainment

మొత్తానికి సెట్స్ పైకొచ్చిన నాగార్జున

కరోనై వైరస్ కు భయపడి సీనియర్లంతా తమ సినిమాల్ని వాయిదా వేసుకున్నారు. అందరికంటే ముందొస్తారనుకున్న చిరంజీవి కూడా తన ఆచార్య మూవీ షూటింగ్ ను పక్కన పెట్టేశారు. ఓ మంత్రం జపిస్తే కరోనా ఎగిరిపోతుందని చెప్పిన బాలయ్య కూడా సెట్స్ పైకి రాలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు సీనియర్ హీరో నాగార్జున. నాగ్ హీరోగా వైల్డ్ డాగ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో షెడ్యూల్ జరిపితే ఈ […]

మొత్తానికి సెట్స్ పైకొచ్చిన నాగార్జున
X

కరోనై వైరస్ కు భయపడి సీనియర్లంతా తమ సినిమాల్ని వాయిదా వేసుకున్నారు. అందరికంటే ముందొస్తారనుకున్న చిరంజీవి కూడా తన ఆచార్య మూవీ షూటింగ్ ను పక్కన పెట్టేశారు. ఓ మంత్రం జపిస్తే కరోనా ఎగిరిపోతుందని చెప్పిన బాలయ్య కూడా సెట్స్ పైకి రాలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు సీనియర్ హీరో నాగార్జున.

నాగ్ హీరోగా వైల్డ్ డాగ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో షెడ్యూల్ జరిపితే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. అందుకే ఆ పని పూర్తిచేసేందుకు నాగ్ సెట్స్ పైకొచ్చాడు. అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో వైల్డ్ డాగ్ షూట్ మొదలైంది.

ప్రభుత్వ నిబంధనల మేరకు అతి తక్కువ మంది యూనిట్ తో, అన్ని ముందుజాగ్రత్త చర్యలతో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఈ షూట్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

First Published:  3 Sep 2020 10:00 AM GMT
Next Story