Telugu Global
National

టీటీడీలో కాగ్ ఆడిట్‌... జగన్‌కు స్వామి కృతజ్ఞతలు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆదాయ, వ్యయాలను ఇకపై కాగ్ చేత ఆడిట్ చేయించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్‌, వైవీ సుబ్బారెడ్డిలకు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కృతజ్ఞతలు తెలిపారు. చాలాకాలంగా టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్ చేత ఆడిట్ చేయించాలని సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో తిరుమల ఆలయానికి భక్తుల నుంచి […]

టీటీడీలో కాగ్ ఆడిట్‌... జగన్‌కు స్వామి కృతజ్ఞతలు
X

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆదాయ, వ్యయాలను ఇకపై కాగ్ చేత ఆడిట్ చేయించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్‌, వైవీ సుబ్బారెడ్డిలకు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కృతజ్ఞతలు తెలిపారు.

చాలాకాలంగా టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్ చేత ఆడిట్ చేయించాలని సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో తిరుమల ఆలయానికి భక్తుల నుంచి వచ్చిన విరాళాలు, కానుకలతో పాటు ఇక ముందు కూడా కాగ్ చేత ఆడిట్ చేయించాలని పోరాడుతున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారని.. కనీసం కొత్త ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అయినా స్పందించాలని ఒక సందర్భంలో సుబ్రమణ్యస్వామి కోరారు. 2020–21 నుంచి టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని ఆగస్టు 28న సమావేశమైన టీటీడీ పాలకమండలి తీర్మానాన్ని ఆమోదించింది. హైకోర్టుకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని నిర్ణయించింది.

2014 నుంచి 2019 వరకు టీటీడీ నిధుల వ్యయాన్ని కాగ్‌తో ఆడిటింగ్‌ చేయించాల్సిందిగా ప్రభుత్వాన్ని టీటీడీ కోరింది. ఇందుకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి అంగీకరించారు.

First Published:  3 Sep 2020 2:29 AM GMT
Next Story