Telugu Global
National

ఇంగ్లీష్‌ రాకుంటే నా వాదన వినేవారా?- సుప్రీంలో ఏపీ తరపున లాయర్‌

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలను హైకోర్టు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆ మధ్య ఆశ్రయించింది. గురువారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఏపీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది విశ్వనాథన్‌ ఇంగ్లీష్‌ భాష అవసరాన్ని వివరించారు. ఇంగ్లీష్ లేకుంటే […]

ఇంగ్లీష్‌ రాకుంటే నా వాదన వినేవారా?- సుప్రీంలో ఏపీ తరపున లాయర్‌
X

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలను హైకోర్టు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆ మధ్య ఆశ్రయించింది. గురువారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.

ఈ సందర్భంగా ఏపీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది విశ్వనాథన్‌ ఇంగ్లీష్‌ భాష అవసరాన్ని వివరించారు. ఇంగ్లీష్ లేకుంటే తాను ఇక్కడి వరకు వచ్చి వాదించేవాడినా అని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం ప్రగతిశీల నిర్ణయం తీసుకుందని దాన్ని సమర్థించాలని కోరారు.

”నేను 40 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామం నుంచి కొయంబత్తూరు వెళ్లి చదువుకున్నాను. నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఉండకపోతే ఈరోజు నా వాదనలను మీరు వినేవారా.. మీ ముందు నేను ఇలా ఇంగ్లీష్‌లో మాట్లాడేవాడినా?. ఆంగ్లంలో ప్రావీణ్యం లేకుంటే ఒక ప్రాంతానికే పరిమితమవుతాం. మనం ప్రాక్టికల్‌గా ఆలోచిద్దాం. ఇది రాజ్యాంగం, చట్టానికి లోబడే చేస్తున్న ఒక అభ్యుదయకరమైన చర్య. దీనికి దృఢ సంకల్పం కావాలి. ఒక గట్టి ప్రభుత్వం మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకోగలుగుతుంది. చట్టానికి అనుగుణంగా మాతృభాషను పరిరక్షిస్తూ ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యా బోధనకు సిద్ధమయ్యాం. ఆర్థిక స్థోమత లేని పేదలు ప్రభుత్వ బడుల్లో ఉండిపోతున్నారు… ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తన పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ విద్యను అందించేందుకు ముందుకు రావడం ప్రగతశీల చర్య” అంటూ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు.

మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన ఉండాలంటున్న వారు ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తున్న అంశాన్ని ప్రశ్నించకపోవడాన్ని కూడా న్యాయవాది ప్రస్తావించారు.

First Published:  4 Sep 2020 12:37 AM GMT
Next Story