Telugu Global
National

రమేష్ ఆస్పత్రిపై సుప్రీంలో ఏపీ పిటిషన్

స్వర్ణప్యాలెస్ హోటల్‌లో అగ్నిప్రమాదంలో 10 మంది చనిపోవడానికి కారణం అవడంతో పాటు.. కరోనా లేని వారి నుంచి కూడా లక్షలు వసూలు చేస్తూ నకిలీ వైద్యం చేసిన రమేష్ ఆస్పత్రి వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గురువారం ఏపీ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని విజ్ఞప్తి చేసింది. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల 10 మంది చనిపోవడంతో పాటు […]

రమేష్ ఆస్పత్రిపై సుప్రీంలో ఏపీ పిటిషన్
X

స్వర్ణప్యాలెస్ హోటల్‌లో అగ్నిప్రమాదంలో 10 మంది చనిపోవడానికి కారణం అవడంతో పాటు.. కరోనా లేని వారి నుంచి కూడా లక్షలు వసూలు చేస్తూ నకిలీ వైద్యం చేసిన రమేష్ ఆస్పత్రి వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

గురువారం ఏపీ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని విజ్ఞప్తి చేసింది. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల 10 మంది చనిపోవడంతో పాటు ఆస్పత్రి నిర్వాహణలో అనేక లోపాలున్నాయని పిటిషన్‌లో వివరించింది. ఆస్పత్రి యజమాని ఏమాత్రం దర్యాప్తుకు సహకరించలేదని.. ఇప్పటికీ అతడు పరారీలో ఉన్నాడని వివరించింది.

హైకోర్టు తీర్పు వల్ల అసలు ఈ అంశంలో దర్యాప్తుకు వీలులేకుండాపోతోందని వివరించింది. రమేష్ ఆస్పత్రి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే రమేష్ ఆస్పత్రి యజమానిపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ ఇటీవల హైకోర్టు ఆదేశించింది. పలు ఉల్లంఘనలకు పాల్పడడంతో పాటు, కరోనా లేని వారికి కూడా కరోనా ఉన్నట్టు వైద్యం చేసిన నేపథ్యంలో ఆస్పత్రి గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదంటూ అధికారులు ఇచ్చిన నోటీసులను కూడా ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. దాంతో రమేష్ ఆస్పత్రి వ్యవహారంలో ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

First Published:  3 Sep 2020 9:59 PM GMT
Next Story