Telugu Global
National

కళా స్థానంలో అచ్చెన్నాయుడు... బాబు మరో కు'తంత్రం'

ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి అచ్చెన్నాయుడికి కట్టబెడుతున్నారు. పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న వార్త ఇది. టీడీపీ అనుకూల మీడియా కూడా ఏదో జాతీయ పదవి ఇస్తున్నట్టు బాగా కవర్ చేసింది. ఇంతకీ అచ్చెన్నకు అసలు పదవి ఇస్తారా? ఇస్తే ఆయన దాంతో ఏం చేస్తారు? ఎవరిని శాసిస్తారు? ఎవరి ఆదేశాలు పాటిస్తారు? పదవి ఎవరికిచ్చినా పగ్గాలు ఉండేది మాత్రం చంద్రబాబు చేతిలోనే అనే విషయం అందరికీ తెలుసు. ఆమాత్రం దానికి ఏపీలో టీడీపీ […]

కళా స్థానంలో అచ్చెన్నాయుడు... బాబు మరో కుతంత్రం
X

ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి అచ్చెన్నాయుడికి కట్టబెడుతున్నారు. పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న వార్త ఇది. టీడీపీ అనుకూల మీడియా కూడా ఏదో జాతీయ పదవి ఇస్తున్నట్టు బాగా కవర్ చేసింది.

ఇంతకీ అచ్చెన్నకు అసలు పదవి ఇస్తారా? ఇస్తే ఆయన దాంతో ఏం చేస్తారు? ఎవరిని శాసిస్తారు? ఎవరి ఆదేశాలు పాటిస్తారు? పదవి ఎవరికిచ్చినా పగ్గాలు ఉండేది మాత్రం చంద్రబాబు చేతిలోనే అనే విషయం అందరికీ తెలుసు. ఆమాత్రం దానికి ఏపీలో టీడీపీ అధ్యక్షుడిగా కళా ఉంటే ఏంటి? అచ్చెన్నాయుడు అయితే ఏంటి? ఏపీ టీడీపీ అధ్యక్ష పీఠానికి అంత విలువే ఉంటే.. కచ్చితంగా తన కొడుకు లోకేష్ కే ఆ స్థానం అప్పగించేవారు చంద్రబాబు.

చేతిలో కీలుబొమ్మల్లా ఆడించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు నమ్మిన బంటులు కావాలి కాబట్టే అక్కడా ఇక్కడా ఇద్దరు డమ్మీ నేతల్ని పెట్టి ఆడిస్తున్నారు చంద్రబాబు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయి జైలుకెళ్లొచ్చారు కాబట్టి అందులోనూ ఆ కేసులో లోకేష్ పేరు బైటకు రాకుండా చూశారు కాబట్టే అచ్చెన్నాయుడికి చంద్రబాబు ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారని వైరిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

అదే సమయంలో వర్ల రామయ్య రాజ్యసభ పోటీని కూడా గుర్తు చేస్తున్నారు. ఎలాగూ ఓడిపోయే సీటు కాబట్టి వర్ల రామయ్యకి అవకాశమిచ్చి దళితులపై లేనిపోని ప్రేమ ఒలకబోసిన చంద్రబాబు, గెలిచే స్థానాలను తన వారికే కట్టబెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. అప్పుడు వర్లను బలిపశువుని చేసినట్టే.. ఇప్పుడు అచ్చెన్నాయుడిపై సింపతీ చూపిస్తూ ఆయనకి పార్టీ పగ్గాలు అప్పగిస్తారంటూ ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. ఇది కేవలం ప్రచారమేనని, కావాలని టీడీపీ అనుకూల మీడియాతో ఇలా గాసిప్ లు వదులుతున్నారనే వాదన కూడా ఉంది.

గతంలో ఎర్రన్నాయుడు కొడుక్కి టీడీపీ పగ్గాలు ఇస్తారంటూ వార్తలొచ్చాయి. యువనాయకుడు రామ్ మోహన్ నాయుడికి పార్టీ అధ్యక్షపదవి ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉత్తరాంధ్ర శ్రేణులనుంచి వినిపించింది. ఆ ఒత్తిడిని చాకచక్యంగా మొగ్గలోనే తుంచేశారు చంద్రబాబు, చినబాబు. రామ్ మోహన్ నాయుడితోనే ప్రెస్ మీట్ పెట్టించి, నాకే పదవీ అక్కర్లేదని చెప్పించారు.

పార్టీలో లోకేష్ కి ఎవరూ పోటీ లేకుండా చూడటమే చంద్రబాబు పని. టీడీపీ పగ్గాలు నారా వారి కుటుంబాన్ని దాటి నందమూరి ఫ్యామిలీలోకి పోకుండా చూడటమే ఆయన మాస్టర్ ప్లాన్. అందులో భాగంగానే ఈ పుకార్లు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడికి చంద్రబాబు పార్టీ పగ్గాలు అప్పగించే ప్రసక్తే లేదు, ఒకవేళ ఇచ్చినా.. ఆయనకు అధికారాలుండే ప్రశ్నే లేదు.

First Published:  4 Sep 2020 5:56 AM GMT
Next Story