Telugu Global
National

కరోనాను మిజోరాం ఎలా జయించగలిగింది?

దేశవ్యాప్తంగా కరోనా భయాందోళనలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఒక వైపు దేశంలో కోవిడ్-19 మరణాలు పెరుగుతున్నా.. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం మాత్రం కరోనాను జయించిన తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది. గత మంగళవారం దేశవ్యాప్తంగా నమోదైన 819 మరణాల్లో పశ్చిమ బెంగాల్‌తో కలిపి ఎనిమిది రాష్ట్రాల్లోనే 80 శాతం ఉన్నాయి. కానీ మిజోరాం రాష్ట్రంలో మాత్రం కేవలం ఒకటే ఒక మరణం నమోదైంది. ఇప్పటి వరకు మిజోరాంలో 1011 మంది కరోనా బారిన పడగా, వారిలో 420 […]

కరోనాను మిజోరాం ఎలా జయించగలిగింది?
X

దేశవ్యాప్తంగా కరోనా భయాందోళనలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఒక వైపు దేశంలో కోవిడ్-19 మరణాలు పెరుగుతున్నా.. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం మాత్రం కరోనాను జయించిన తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది. గత మంగళవారం దేశవ్యాప్తంగా నమోదైన 819 మరణాల్లో పశ్చిమ బెంగాల్‌తో కలిపి ఎనిమిది రాష్ట్రాల్లోనే 80 శాతం ఉన్నాయి. కానీ మిజోరాం రాష్ట్రంలో మాత్రం కేవలం ఒకటే ఒక మరణం నమోదైంది. ఇప్పటి వరకు మిజోరాంలో 1011 మంది కరోనా బారిన పడగా, వారిలో 420 మంది రోగులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. రాష్ట్రంలో మరణాలు 0 కు చేరుకున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని వారు వెల్లడిస్తున్నారు.

‘ప్రస్తుతం రాష్ట్రంలో చాలా తక్కువగా సీరియస్ కేసులు ఉన్నాయి.. ఇది నిజంగా అదృష్టమనే చెప్పుకోవాలి’ అని రాష్ట్రానికి చెందిన ప్రజారోగ్య శాఖ సీనియల్ అధికారి ఎరిక్ జోమావియా అన్నారు. కోవిడ్-19గా నిర్థారణ అయిన వెంటనే ఆ రోగులను కోవిడ్-19 కేర్ సెంటర్లకు, ప్రభుత్వ ఆసుపత్రుకు తరలించి చికిత్స అందించామని ఆయన చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చిత్త శుద్దిని మెచ్చుకోవాలని ఆయన అన్నారు.

మిజోరాంలో తొలి కేసు మార్చి 25న నమోదు అయ్యింది. విదేశీ ప్రయాణం చేసి వచ్చిన ఒక వ్యక్తి కరోనా పాజిటివ్‌గా తేలాడు. ఆ తర్వాత మళ్లీ జూన్ మొదటి వారం వరకు ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే జూన్ 9న ఒకేసారి 46 కేసులు నమోదు కావడం ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఆ తర్వాత అగస్టు 15న ఓకే రోజు 120 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనాగా నిర్థారణ అయిన వాళ్లు స్వల్ప లక్షణాలతోనే కోలుకున్నారు. కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం చాలా రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స చేయించుకోవలసి వచ్చింది. అయితే ఎందుకు ఇలా జరిగిందనే విషయంపై అధ్యయనం జరగాల్సి ఉందని జోరామ్ మెడికల్ కళాశాల డీన్, సీనియర్ మైక్రోబయాలజిస్ట్ సుకంతా సిన్హా అన్నారు. రాష్ట్రంలో కోవిడ్-19 కోసమే ప్రత్యేక వసతులు కలిగిన ఏకైక ఆసుపత్రి ఈ కళాశాలకు అనుబంధంగానే ఉంది. ఇది రాజధాని ఐజ్వాల్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

సిక్కిం తర్వాత అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన ఈశాన్య రాష్ట్రం మిజోరాం. అయితే ఇక్కడ కొండలు, గుట్టలు, లోయలతో కూడిన ప్రాంతం కావడంతో కోవిడ్‌ను ఎదుర్కోవడం కష్టమని అందరూ భావించారు. కానీ ప్రజలు ఎంతో క్రమశిక్షణ కలిగి, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడంతో కోవిడ్‌ను విజయవంతంగా జయించగలిగినట్లు సుకంతా సిన్హా పేర్కొన్నారు.

ప్రభుత్వంతో ప్రజలను కూడా భాగస్వాములుగా చేయడం వల్లే ఇతర రాష్ట్రాల కంటే మిజోరాంలో కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కున్నట్లు ఆయన పేర్కొన్నారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి ఈ రాష్ట్రంలో కనీసం మౌళిక సదుపాయాలు కూడా లేవు. ఎలాంటి వైరాలజీ ల్యాబ్స్‌లేని ఈ రాష్ట్రం.. ఏడు రోజుల్లో ఒక ల్యాబ్ నిర్మించిందంటే వారి నిబద్దత అర్థం చేసుకోవచ్చు.

ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ల్యాబ్స్ నుంచి పరికరాలు తెప్పించి కోవిడ్ పరీక్షలు మొదలు పెట్టారు. జనాభా తక్కువగా ఉన్నా.. కేసులు ఎంత సీరియస్‌గా మారుతాయో అర్థం కాని పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులు, మైక్రోబయాలజిస్టులు, ఇతర సిబ్బంది శక్తివంచన లేకుండా పని చేశారు. ఒక మైక్రోబయాలజిస్ట్ రోజుల బిడ్డను ఇంటి వద్ద వదిలి ప్రతీ రోజు ల్యాబ్‌కు వచ్చే వారు. ఇది చాలా చిన్న విషయం అనిపించవచ్చు. కానీ కోవిడ్ మహమ్మారి కాలంలో ఆ మైక్రోబయాలజిస్ట్ చేసిన సేవను తప్పక గుర్తించాల్సిందేనని సిన్హా అన్నారు.

ఇక ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మిజోరాం ప్రజలు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటారు. అంతే కాకుండా వీరి జన్యువులు కూడా ప్రమాదకర రోగాలను తట్టుకునేలా ఉంటుంది. అందుకే కోవిడ్ ఇక్కడి ప్రజలను ఏమీ చేయలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదేమైనా చిన్న రాష్ట్రమైనా కరోనాను ఎదుర్కోవడంతో సమర్థవంతంగా వ్యవహరించినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రశంసలు కురిపించింది.

First Published:  3 Sep 2020 9:21 PM GMT
Next Story