Telugu Global
Cinema & Entertainment

రావణాసురుడు దొరికేశాడు

ప్రభాస్ హీరోగా రాబోతున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్, శ్రీరాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో విలన్ పాత్రధారిగా సైఫ్ అలీఖాన్ ను ఎంపిక చేశారు. సినిమాలో రావణాసురుడిగా సైఫ్ కనిపించబోతున్నాడు. ఆదిపురుష్ లో తను రావణ్ పాత్రకు ఎంపికైన విషయాన్ని సైఫ్ కన్ ఫర్మ్ చేశాడు. ఓం రౌత్ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని, ప్రభాస్ తో కత్తిదూయడానికి సిద్ధమౌతున్నట్టు ప్రకటించాడు సైఫ్. మరోవైపు […]

రావణాసురుడు దొరికేశాడు
X

ప్రభాస్ హీరోగా రాబోతున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్, శ్రీరాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో విలన్ పాత్రధారిగా సైఫ్ అలీఖాన్ ను ఎంపిక చేశారు. సినిమాలో రావణాసురుడిగా సైఫ్ కనిపించబోతున్నాడు.

ఆదిపురుష్ లో తను రావణ్ పాత్రకు ఎంపికైన విషయాన్ని సైఫ్ కన్ ఫర్మ్ చేశాడు. ఓం రౌత్ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని, ప్రభాస్ తో కత్తిదూయడానికి సిద్ధమౌతున్నట్టు ప్రకటించాడు సైఫ్.

మరోవైపు ఈ సినిమాలో సీత పాత్ర కోసం కియరా అద్వానీని అనుకుంటున్నారు. కాకపోతే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఎందుకంటే.. లస్ట్ స్టోరీస్ లో మోస్ట్ ఎరోటిక్ గా నటించింది కియరా. అలాంటి హీరోయిన్ ను ఎంతో ఔన్నత్యం కలిగిన సీత పాత్ర కోసం తీసుకోవద్దంటున్నారు చాలామంది నెటిజన్లు. దీనిపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది.

First Published:  3 Sep 2020 7:30 PM GMT
Next Story