Telugu Global
CRIME

20 రోజుల్లో ఒకే జిల్లాలో... ముగ్గురు మైనర్ బాలికల హత్య !

ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను ప్రభుత్వాలు కానీ, సమాజం గానీ ఇప్పటికీ సీరియస్ గా తీసుకోవటం లేదనే మాట నిజం. ఎప్పటికప్పుడు అలాంటి ఘటనలు వార్తలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖెరీ అనే జిల్లాలో ఇరవైరోజుల్లో ముగ్గురు మైనర్ ఆడపిల్లలు అత్యంత పాశవికంగా అత్యాచారాలు, హత్యలకు గురయ్యారు. లఖింపూర్ ఖెరీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి అత్యాచారానికి, హత్యకు గురయినట్టుగా గురువారం పోలీసులు గుర్తించారు.  బుధవారం నుండి కనిపించకుండా పోయిన […]

20 రోజుల్లో ఒకే జిల్లాలో... ముగ్గురు మైనర్ బాలికల హత్య !
X

ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను ప్రభుత్వాలు కానీ, సమాజం గానీ ఇప్పటికీ సీరియస్ గా తీసుకోవటం లేదనే మాట నిజం. ఎప్పటికప్పుడు అలాంటి ఘటనలు వార్తలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖెరీ అనే జిల్లాలో ఇరవైరోజుల్లో ముగ్గురు మైనర్ ఆడపిల్లలు అత్యంత పాశవికంగా అత్యాచారాలు, హత్యలకు గురయ్యారు.

లఖింపూర్ ఖెరీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి అత్యాచారానికి, హత్యకు గురయినట్టుగా గురువారం పోలీసులు గుర్తించారు. బుధవారం నుండి కనిపించకుండా పోయిన చిన్నారి మృతదేహం ఆమె నివసిస్తున్న గ్రామానికి చేరువలో పడిఉండటం పోలీసులు గుర్తించారు. బాలిక తలపై కొట్టి చంపినట్టుగా గాయాలను బట్టి తెలుస్తోంది. తమ గ్రామానికి చెందిన లెఖ్ రామ్ అనే వ్యక్తి తమ కుమార్తెని కిడ్నాప్ చేసి హత్య చేశాడని, అతనితో తమకు చాలాకాలంగా గొడవలు ఉన్నాయని… చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

లఖింపూర్ ఖెరీ జిల్లాలోనే ఇటీవల పదిహేడేళ్ల యువతి అత్యాచారానికి హత్యకు గురయింది. స్కాలర్ షిప్ ఫామ్ పూర్తి చేసి వస్తానని వెళ్లిన అమ్మాయి ఇంటికి తిరిగిరాలేదు. గ్రామానికి చేరువలో ఒక పాడుబడిన చెరువువద్ద ఆమె మృతదేహం కనిపించింది. అంతకుముందు 13 ఏళ్ల బాలిక కూడా ఇలాగే అత్యాచారానికి హత్యకు గురయ్యింది.

పంజాబ్ లోని లూథియానాలో ముగ్గురు టీనేజి కుర్రాళ్లు… 16 ఏళ్ల అమ్మాయిని రేప్ చేయడమే కాకుండా… అదంతా తమ ఫోనుల్లో వీడియో తీశారు. ఇళ్లలో సహాయకురాలిగా పనిచేసే ఆ అమ్మాయిని ఆ యువకులు బలవంతంగా తమ బండిపై తీసుకుని వెళ్లారు. తమతో రాకపోతే యాసిడ్ పోస్తామని బెదిరించడంతో ఆమె భయపడి వారు చెప్పనట్టుగా చేసింది. ఆదివారం సంఘటన జరిగితే అమ్మాయి భయపడి వెంటనే బయటపెట్టలేదు. తరువాత తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ లో అత్యాచారానికి గురయిన ఒక బాలిక కోమాలోకి వెళ్లిపోయింది. ఈ కేసు వెలుగులోకి వచ్చాక స్థానికులు నిందితుడి ఇంటిపై దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు.

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన మరొక ఘటనలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అమ్మాయి ఎదురు తిరగటంతో ముగ్గురు యువకులు ఆమెని ఇనుపరాడ్ తో తీవ్రంగా గాయపరచారు. తమ దురాగతాన్ని వీడియో తీసి… ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు దుండగులు. ముప్పయ్యేళ్లు లోపు వయసున్న ఆ ముగ్గురు యువకుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇలాంటి దారుణాలు జరగని రోజంటూ లేదు. వీటిని చూస్తుంటే… మనం సురక్షితమైన నాగరిక సమాజాన్ని నిర్మించుకోవడానికి ఇంకెన్ని శతాబ్దాలు పడుతుందో అనిపిస్తుంది కదా.

First Published:  4 Sep 2020 4:58 AM GMT
Next Story