మళ్లీ తెలుగులోకి దిశా పటానీ….

దిశా పటానీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న హీరోయిన్. అయితే ఈమె ఎంట్రీ మాత్రం తెలుగులోనే జరిగిందనే విషయం చాలామందికి గుర్తు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో ఈమె హీరోయిన్ గా మారింది. ఆ సినిమా సక్సెస్ అయిన వెంటనే బాలీవుడ్ కు చెక్కేసిన ఈ చిన్నది.. తన అందచందాలతో అక్కడ గ్లామర్ స్టార్ అయిపోయింది.

అలా బాలీవుడ్ కే ఫిక్స్ అయిన దిశా పటానీ, ఎట్టకేలకు మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది. అవును.. ఈ సెక్సీ బ్యూటీ మరోసారి తెలుగులోకి వస్తోంది. అయితే ఈసారి ఆమె సినిమా చేయడం లేదు. ఓ వెబ్ సిరీస్ లో నటించబోతోంది.

టాలీవుడ్ కు చెందిన ఓ దర్శకుడు స్క్రిప్ట్ అందించగా.. త్వరలోనే ఓ వెబ్ సిరీస్ లాంఛ్ కాబోతోంది. ఇందులో టాలీవుడ్ కు చెందిన ఓ మోస్తరు హీరో నటించబోతున్నాడు. హీరోయిన్ ను దిశాపటానీని తీసుకోవాలనుకుంటున్నారు. కేవలం నెల రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందనేది ఒప్పందం. పైగా సినిమాకు ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే 30శాతం ఎక్కువే ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. త్వరలోనే ఆ వివరాలు బయటకు రాబోతున్నాయి.