Telugu Global
National

జగన్‌ తీసుకున్న చర్యల వల్లే టాప్‌ ర్యాంక్

ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీకి నెంబర్ వన్ ర్యాంకుపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యల వల్లే టాప్‌ ర్యాంక్‌ వచ్చిందని ఆయన అన్నారు. కరోనా దుర్భర పరిస్థితుల్లోనూ ఎస్‌ఎస్‌ఎంఈలకు ప్రభుత్వం తోడ్పాటును అందించిందని గౌతమ్ రెడ్డి వివరించారు. పరిశ్రమలు తిరిగి నడిచేలా ఆర్థిక తోడ్పాటుతో పాటు, భరోసాను సీఎం జగన్ కల్పించారన్నారు. గతం కంటే ఈసారి విభిన్నంగా సర్వే నిర్వహించారు. గతంలో […]

జగన్‌ తీసుకున్న చర్యల వల్లే టాప్‌ ర్యాంక్
X

ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీకి నెంబర్ వన్ ర్యాంకుపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యల వల్లే టాప్‌ ర్యాంక్‌ వచ్చిందని ఆయన అన్నారు. కరోనా దుర్భర పరిస్థితుల్లోనూ ఎస్‌ఎస్‌ఎంఈలకు ప్రభుత్వం తోడ్పాటును అందించిందని గౌతమ్ రెడ్డి వివరించారు. పరిశ్రమలు తిరిగి నడిచేలా ఆర్థిక తోడ్పాటుతో పాటు, భరోసాను సీఎం జగన్ కల్పించారన్నారు.

గతం కంటే ఈసారి విభిన్నంగా సర్వే నిర్వహించారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చే నివేదికల ఆధారంగానే ర్యాంకులను ప్రకటించేవారు. ఈసారి మాత్రం పరిశ్రామికవేత్తలు, వినియోగదారుల నుంచి అభిప్రాయలను తీసుకుని ర్యాంకులను ప్రకటించారు.
పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చారన్నారు.

సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పరిశ్రమలకు భూకేటాయింపులు, వాణిజ్య వివాదాలకు ఈ- ఫైలింగ్ సౌకర్యం, విశాఖలో స్పెషల్ కోర్టు, ఔషదాల విక్రయ లైసెన్స్‌ ఆన్‌లైన్‌లోనే పొందే సౌకర్యం, ఏటా రెన్యువల్ చేసుకునే అవసరం లేకుండా షాప్‌లకు మినహాయింపు, కార్మిక చట్టాల కింద సింగిల్ ఇంటిగ్రేటెడ్ రిటర్న్స్‌ దాఖలు, ప్రతి పరిశ్రమలో ఇంజనీర్లతో తప్పనిసరిగా బాయిలర్ ఇన్‌స్పెక్షన్ వంటి చర్యలు తీసుకున్నామన్నారు. హిందూపురం, విజయవాడ, విశాఖ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ల్లో వాణిజ్యవేత్తలతో పలుమార్లు ప్రభుత్వం సమావేశాలు నిర్వహించినట్లు మేకపాటి చెప్పారు.

పెరిగిన పారద్శకత, మెరుగైన పనితీరుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్‌లు అద్దం పడుతాయని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని వ్యాఖ్యానించారు. టాప్‌ త్రీలో నిలిచిన ఏపీ, యూపీ, తెలంగాణ రాష్ట్రాలను ఆమె అభినంధించారు. పెట్టుబడుల ఆకర్షనలో రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆరోగ్యకరమైన పోటీలో ఈ మూడు రాష్ట్రాలు ముందున్నాయని నిర్మలా సీతారామన్ అభినందించారు.

First Published:  5 Sep 2020 9:05 AM GMT
Next Story