Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ సినిమాల ఆర్డర్ ఇదే

వరుసపెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ క్రమంలో ఏది ముందుచేస్తాడు, ఏది తర్వాత చేస్తాడనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఇప్పుడా సస్పెన్స్ కు కూడా సమాధానం దొరికింది. తన సినిమాల ఆర్డర్ ను ఈ హీరో బయటపెట్టాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ హీరో ముందున్నతొలి ప్రాధాన్యం ఇదే. ఎట్టిపరిస్థితుల్లో రాబోయే 3-4 నెలల్లో ఈ సినిమాను పూర్తిచేయాలి. ఈ సినిమా తర్వాత ఆయన నాగ్ అశ్విన్ సినిమాను స్టార్ట్ చేస్తాడా లేక […]

ప్రభాస్ సినిమాల ఆర్డర్ ఇదే
X

వరుసపెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ క్రమంలో ఏది ముందుచేస్తాడు, ఏది తర్వాత చేస్తాడనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఇప్పుడా సస్పెన్స్ కు కూడా సమాధానం దొరికింది. తన సినిమాల ఆర్డర్ ను ఈ హీరో బయటపెట్టాడు.

ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ హీరో ముందున్నతొలి ప్రాధాన్యం ఇదే. ఎట్టిపరిస్థితుల్లో రాబోయే 3-4 నెలల్లో ఈ సినిమాను పూర్తిచేయాలి. ఈ సినిమా తర్వాత ఆయన నాగ్ అశ్విన్ సినిమాను స్టార్ట్ చేస్తాడా లేక ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ ను సెట్స్ పైకి తీసుకొస్తాడా అనే అనుమానం అందర్లో ఉంది. ఆదిపురుష్ నే ప్రభాస్ సెట్స్ పైకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

దాదాపు 7 నెలల కిందటే నాగ్ అశ్విన్ సినిమాను ఎనౌన్స్ చేసినప్పటికీ.. అదింకా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. హీరోయిన్ గా దీపిక పదుకోన్ ను ప్రకటించినా.. స్టోరీ-స్క్రీన్ ప్లే విషయంలో నాగ్ అశ్విన్ సినిమా ఇంకా కొలిక్కిరాలేదట.

అదే సమయంలో ఓం రౌత్ మాత్రం ఆదిపురుష్ ను సెట్ చేశాడట. ఏకంగా స్టోరీ బోర్డ్ తో సిద్ధమైపోయాడట. అంతేకాదు.. తన సినిమాకు జస్ట్ 70 రోజుల కాల్షీట్ చాలంటున్నాడు ఈ దర్శకుడు. మూవీ మొత్తాన్ని గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసి, తర్వాత గ్రాఫిక్స్ చేయించుకుంటానని చెబుతున్నాడు. సో.. నాగ్ అశ్విన్ సినిమా కంటే ముందు ఆదిపురుష్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.

First Published:  5 Sep 2020 6:00 AM GMT
Next Story