Telugu Global
Cinema & Entertainment

ఇప్పట్లో డేటింగ్ ఆలోచన లేదు

హీరోయిన్ రష్మికపై రూమర్స్ కు కొదవ లేదు. ఎప్పటికప్పుడు ఆమె ప్రేమలో పడిందంటూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అవే తరహా పుకార్లు వచ్చాయి. టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోతో ఆమె డేటింగ్ లో ఉందంటూ ఫ్రెష్ గా రూమర్లు మొదలయ్యాయి. అయితే ఈసారి మాత్రం రష్మిక వాటిపై స్పందించింది. “నేను ప్రస్తుతం సింగిల్. చాలా హ్యాపీగా ఉన్నాను. సింగిల్ గా ఉండడం వల్ల ఉన్న సమస్య ఏంటంటే… ఎవరో ఒకరితో డేటింగ్ […]

rashmika mandanna movies list
X

హీరోయిన్ రష్మికపై రూమర్స్ కు కొదవ లేదు. ఎప్పటికప్పుడు ఆమె ప్రేమలో పడిందంటూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అవే తరహా పుకార్లు వచ్చాయి. టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోతో ఆమె డేటింగ్ లో ఉందంటూ ఫ్రెష్ గా రూమర్లు మొదలయ్యాయి. అయితే ఈసారి మాత్రం రష్మిక వాటిపై స్పందించింది.

“నేను ప్రస్తుతం సింగిల్. చాలా హ్యాపీగా ఉన్నాను. సింగిల్ గా ఉండడం వల్ల ఉన్న సమస్య ఏంటంటే… ఎవరో ఒకరితో డేటింగ్ లో ఉందని వార్తలు అల్లేస్తారు. డేటింగ్ చెయ్యకుండా… సింగిల్ గా ఉండలేమా.. ఉండకూడదా?”

ఇలా తను సింగిల్ గా ఉన్న విషయాన్ని ప్రకటించింది రష్మిక. అంతేకాదు.. ప్రస్తుతం తనకు సినిమాలే లోకమని, ఇప్పట్లో డేటింగ్ చేసే ఉద్దేశం కూడా లేదని ప్రకటించింది. బన్నీ సరసన పుష్ప సినిమాకు సైన్ చేసింది రష్మిక. ప్రస్తుతం ఆ సినిమా కోసం వెయిటింగ్. ఈ సినిమా సెట్స్ పైకి వస్తే తప్ప.. రష్మిక మరో సినిమాకు కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేని పరిస్థితి.

First Published:  5 Sep 2020 1:00 AM GMT
Next Story