Telugu Global
Cinema & Entertainment

డ్రగ్స్ కేసులో రియా సోదరుడు అరెస్ట్

అంతా ఊహించినట్టే జరిగింది. సుశాంత్ మరణం డ్రగ్స్ మలుపు తీసుకున్నప్పుడే అరెస్టులు ఉంటాయని అంతా భావించారు. ఇప్పుడదే జరిగింది. ఈ కేసులో రియా సోదరుడు షోవిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మాదకద్రవ్యాల నిరోధక శాఖ (ఎన్సీబీ) షోవిక్ ను అదుపులోకి తీసుకుంది. కేవలం ఇతడ్ని మాత్రమే కాదు, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరిండాను కూడా ఎన్సీబీ అరెస్ట్ చేసింది. సుశాంత్ మరణం డ్రగ్స్ మలుపు తీసుకున్న వెంటనే ఎన్సీబీ మరింత చురుగ్గా […]

డ్రగ్స్ కేసులో రియా సోదరుడు అరెస్ట్
X

అంతా ఊహించినట్టే జరిగింది. సుశాంత్ మరణం డ్రగ్స్ మలుపు తీసుకున్నప్పుడే అరెస్టులు ఉంటాయని అంతా భావించారు. ఇప్పుడదే జరిగింది. ఈ కేసులో రియా సోదరుడు షోవిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మాదకద్రవ్యాల నిరోధక శాఖ (ఎన్సీబీ) షోవిక్ ను అదుపులోకి తీసుకుంది. కేవలం ఇతడ్ని మాత్రమే కాదు, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరిండాను కూడా ఎన్సీబీ అరెస్ట్ చేసింది.

సుశాంత్ మరణం డ్రగ్స్ మలుపు తీసుకున్న వెంటనే ఎన్సీబీ మరింత చురుగ్గా వ్యవహరించింది. తమ దగ్గరున్న ఆధారాల ఆధారంగా ఓ భారీ మాదక ద్రవ్యాల ముఠాను అరెస్ట్ చేసింది. భారీ ఎత్తున కొకైన్ ను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దర్ని అరెస్ట్ చేసింది. వాళ్లు రియా సోదరుడు షోవిక్ పేరు చెప్పడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. అలా షోవిక్, మిరిండా అరెస్టయ్యారు.

పోలీసుల అదుపులో ఉన్న షోవిక్ పలు కీలక విషయాల్ని వెల్లడించినట్టు బాలీవుడ్ మీడియా తెలిపింది. సుశాంత్ కు డ్రగ్స్ ఇచ్చినట్టు షోవిక్ అంగీకరించాడని, అంతేకాదు.. తన సోదరి రియానే డ్రగ్స్ కొనమని తనను పురమాయించినట్టు షోవిక్ చేప్పాడని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఈరోజు షోవిక్ ను కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కోరబోతున్నారు ఎన్సీబీ అధికారులు.

First Published:  4 Sep 2020 10:08 PM GMT
Next Story