Telugu Global
National

ఏపీలో మండలానికి రెండు పీహెచ్‌సీలు

విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రతి మండలంలో రెండు ప్రాథామిక ఆరోగ్య  కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుతం ఏపీలో 671 మండలాలు ఉండగా… 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. గ్రామీణ ప్రజలకు పీహెచ్‌సీలు మరింత అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని గుర్తించిన ప్రభుత్వం… ఈ మేరకు పీహెచ్‌సీల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా […]

ఏపీలో మండలానికి రెండు పీహెచ్‌సీలు
X

విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రతి మండలంలో రెండు ప్రాథామిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుతం ఏపీలో 671 మండలాలు ఉండగా… 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి.

గ్రామీణ ప్రజలకు పీహెచ్‌సీలు మరింత అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని గుర్తించిన ప్రభుత్వం… ఈ మేరకు పీహెచ్‌సీల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా చేసేందుకు మరో 142 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉన్నాయి. ఆ సంఖ్యను వీలైతే మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో ప్రాథామిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఇందుకోసం వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు తప్పనిసరిగా ఉండేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఒక వైద్యుడు, మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి 8 వరకు మరో వైద్యుడు అందుబాటులో ఉంటారు. రాత్రి 8 తర్వాత అత్యవసరమైతే పీహెచ్‌సీకి వచ్చి వైద్యం అందించేలా ఏర్పాటు చేశారు.

First Published:  5 Sep 2020 9:12 PM GMT
Next Story