Telugu Global
Cinema & Entertainment

పుష్పలో మరో హీరో

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది పుష్ప సినిమా. కేరళలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశారు. రెండో షెడ్యూల్ నాటికి కరోనా వచ్చింది. దీంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాలో మరో హీరోను తీసుకున్నట్టు తెలుస్తోంది. అవును.. పుష్ప సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నారా రోహిత్ ను తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఓ కీలకమైన పోలీసాఫీసర్ పాత్ర ఉంది. […]

పుష్పలో మరో హీరో
X

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది పుష్ప సినిమా. కేరళలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశారు. రెండో షెడ్యూల్ నాటికి కరోనా వచ్చింది. దీంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాలో మరో హీరోను తీసుకున్నట్టు తెలుస్తోంది.

అవును.. పుష్ప సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నారా రోహిత్ ను తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఓ కీలకమైన పోలీసాఫీసర్ పాత్ర ఉంది. ఆ పాత్రకు నారా రోహిత్ అయితే సరిగ్గా సరిపోతాడని భావించి యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. నారా రోహిత్ ఇప్పటివరకు పోషించిన పోలీస్ పాత్రలన్నీ చాలా విలక్షణంగా ఉన్నాయి. అప్పట్లో ఒకడుండేవాడు, రౌడీ ఫెలో, శమంతకమణి లాంటి సినిమాల్లో రోహిత్ పోషించిన పోలీస్ పాత్రలకు మంచి క్రేజ్ వచ్చింది. అందుకే పుష్ప సినిమాలో కూడా ఓ డిఫరెంట్ పోలీస్ క్యారెక్టర్ కు నారా రోహిత్ ను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభంకాబోతోంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ లో సాంగ్ పిక్చరైజేషన్ తో ఈ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. తర్వాత ఫారెస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

First Published:  6 Sep 2020 6:55 AM GMT
Next Story