Telugu Global
Cinema & Entertainment

ఒకే రోజు 3 సినిమాలు ట్రెండింగ్

ఈరోజు ఒకేసారి 3 సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సిన మూవీ నువ్వు నాకు నచ్చావ్. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా రిలీజై సరిగ్గా 19 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా దగ్గుబాటి అభిమానులు ఈ సినిమాను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆర్తి అగర్వాల్ సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది. త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు అందించాడు. ఇక ఈ రోజు ట్రెండ్ అవుతున్న మరో సినిమా చందమామ. కృష్ణవంశీ దర్శకత్వంలో […]

ఒకే రోజు 3 సినిమాలు ట్రెండింగ్
X

ఈరోజు ఒకేసారి 3 సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సిన మూవీ నువ్వు నాకు నచ్చావ్. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా రిలీజై సరిగ్గా 19 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా దగ్గుబాటి అభిమానులు ఈ సినిమాను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆర్తి అగర్వాల్ సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది. త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు అందించాడు.

ఇక ఈ రోజు ట్రెండ్ అవుతున్న మరో సినిమా చందమామ. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఇవాళ్టికి విడుదలై సరిగ్గా 13 ఏళ్లు పూర్తిచేసుకుంది. నవదీప్-శివబాలాజీ హీరోలుగా నటించిన ఈ సినిమాలో కాజల్, సింధు మీనన్ హీరోయిన్లుగా నటించారు. కాజల్ కు ఫస్ట్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన సినిమా ఇదే.

ఇక ఈరోజు ట్రెండ్ అవుతున్న మరో సినిమా తుఫాన్. ఈ సినిమా థియేటర్లలోకొచ్చి ఆరేళ్లు అవుతోంది. నిజానికి ఇది ట్రెండ్ అవ్వాల్సిన సినిమా కాదు. రామ్ చరణ్ కెరీర్ లో డిజాస్టర్ మూవీ ఇది. కానీ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమానే. పైగా మెగా మూవీ కావడంతో ఫ్యాన్స్ అంతా ఈ ఫ్లాప్ సినిమానే ట్రెండ్ చేస్తున్నారు.

First Published:  6 Sep 2020 7:01 AM GMT
Next Story