Telugu Global
Cinema & Entertainment

రజనీకాంత్ కూడా సెట్స్ పైకి

హీరోలంతా ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వెళ్తున్నారు. మొన్నటివరకు చిన్న సినిమాలు మాత్రమే సెట్స్ పైకి వెళ్లగా.. నాగార్జున లాంటి సీనియర్ హీరోలు ఇప్పుడిప్పుడే సెట్స్ పైకి వస్తున్నారు. త్వరలోనే మిగతా హీరోలు కూడా తమ సినిమాల్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు రజనీకాంత్ కూడా నిర్ణయం తీసుకున్నాడు. తను సెట్స్ పైకి వచ్చే తేదీని ఖరారు చేశాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తై అనే సినిమా చేస్తున్నాడు రజనీకాంత్. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పుడీ […]

రజనీకాంత్ కూడా సెట్స్ పైకి
X

హీరోలంతా ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వెళ్తున్నారు. మొన్నటివరకు చిన్న సినిమాలు మాత్రమే సెట్స్ పైకి వెళ్లగా.. నాగార్జున లాంటి సీనియర్ హీరోలు ఇప్పుడిప్పుడే సెట్స్ పైకి వస్తున్నారు. త్వరలోనే మిగతా హీరోలు కూడా తమ సినిమాల్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు రజనీకాంత్ కూడా నిర్ణయం తీసుకున్నాడు. తను సెట్స్ పైకి వచ్చే తేదీని ఖరారు చేశాడు.

ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తై అనే సినిమా చేస్తున్నాడు రజనీకాంత్. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పుడీ మూవీని డిసెంబర్ 12 నుంచి తిరిగి సెట్స్ పైకి తీసుకురావాలనేది రజనీకాంత్ ప్లాన్. డిసెంబర్ 12న సూపర్ స్టార్ పుట్టినరోజు.

ఈ సినిమాలో రజనీకాంత్ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఫ్యామిలీ ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

First Published:  6 Sep 2020 8:30 PM GMT
Next Story