Telugu Global
National

లోకేష్‌ గేర్‌ వేయలేకపోతున్నాడు.... అందుకే బాబు కంగారు పడుతున్నారు

చిన్నపిల్లాడిలాగా, లోకేష్‌లాగా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఇప్పటి వరకు కరోనాకు భయపడే చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారని… కానీ ఇలాగే మాట్లాడితే చంద్రబాబుకు మతిభ్రమించిందని ప్రజలు అనుకునే అవకాశం ఉందన్నారు. అదిగో పులి-ఇదిగో తోక, అక్కడ అది జరిగింది- ఇక్కడ ఇది జరిగింది, ఓ స్త్రీ రేపు రా, గోడ మీద దెయ్యం ఉంది లాంటి నవలలు రాయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అయ్యారని ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ […]

లోకేష్‌ గేర్‌ వేయలేకపోతున్నాడు.... అందుకే బాబు కంగారు పడుతున్నారు
X

చిన్నపిల్లాడిలాగా, లోకేష్‌లాగా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఇప్పటి వరకు కరోనాకు భయపడే చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారని… కానీ ఇలాగే మాట్లాడితే చంద్రబాబుకు మతిభ్రమించిందని ప్రజలు అనుకునే అవకాశం ఉందన్నారు. అదిగో పులి-ఇదిగో తోక, అక్కడ అది జరిగింది- ఇక్కడ ఇది జరిగింది, ఓ స్త్రీ రేపు రా, గోడ మీద దెయ్యం ఉంది లాంటి నవలలు రాయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అయ్యారని ఎద్దేవా చేశారు.

ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ అమలును చూసి మాట్లాడితే బాగుంటుందన్నారు. తొందరపడి ముందే కూయడం ఎందుకని ప్రశ్నించారు. కొడుకు లోకేష్‌ గేర్‌ మార్చలేకపోతున్నారు… ఎక్సలేటర్‌ తొక్కలేకపోతున్నారని అందుకే చంద్రబాబు కంగారుపడుతున్నారని విమర్శించారు. లోకేష్ బండి లేచేది కాదని తెలిసే చంద్రబాబు ఆక్రోశానికి గురవుతున్నారన్నారు.

కరోనా భయంతో ఒక్కడే గదిలో కూర్చుని మానసికంగా దెబ్బతిన్నారని భావించే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు వద్ద కొందరు నెలకు 20వేలు, బిర్యానీ ప్యాకెట్లు తీసుకుని ప్రెస్‌మీట్ పెట్టేవారు ఉన్నారని… వారు మాట్లాడితే పర్వాలేదు గానీ చంద్రబాబే అర్థంలేకుండా మాట్లాడడం బాగోదన్నారు. ఉచిత విద్యుత్‌ విషయంలో ప్రభుత్వ ఆలోచన సరైనది కాకపోతే రెండుమూడు నెలల్లోనే తేలిపోతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ గురించి వార్తలు రాస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్‌లో ఎకరం పొలమైనా ఉందా అని ప్రశ్నించారు. వారు తయారు చేసే పచ్చళ్లకు గానీ, పంచే పాలకు గానీ ఆంధ్రప్రదేశ్‌తో ఏమైనా సంబంధం ఉందా అని మీడియాను వంశీ ప్రశ్నించారు. రాస్తున్న వారికి ఏపీలో ఏం జరుగుతుందో కనీసం ఇంటెలిజెన్స్ సమాచారం కూడా లేదన్నారు. చంద్రబాబుకు వయసుపరమైన ఇబ్బందులున్నాయన్నారు వంశీ.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లోకి వెళ్తే వేలిముద్రపడడంలేదని, బ్యాంకులు డబ్బులు ఇవ్వడం లేదని, పించన్ రావడం లేదని ఇలా అనేక సమస్యలు చెప్పేవారన్నారు. ఈ ప్రభుత్వంలో అలాంటి సమస్యలే వినిపించడం లేదన్నారు. గతంలో ఉన్న సమస్యల్లో 90 శాతం పరిష్కారం అయ్యాయన్నారు.

First Published:  7 Sep 2020 6:40 AM GMT
Next Story