Telugu Global
Cinema & Entertainment

నన్ను ఎవ్వరూ సంప్రదించలేదు

తనకు మంచి పాత్ర దొరికితే చాలంటోంది హీరోయిన్ అదితిరావు హైదరీ. తను చేసేది ఓటీటీ సినిమానా, మెయిన్ స్ట్రీమ్ సినిమానా అనే తేడా చూడనంటోంది. తను ఈ విషయాన్ని కొన్ని రోజుల కిందటే ప్రకటించానని, అయినప్పటికీ ఇప్పటివరకు తనకు ఎలాంటి ఓటీటీ ఆఫర్లు రాలేదంటోంది ఈ బ్యూటీ. నాని-సుధీర్ బాబు నటించిన “వి” అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది అదితిరావు. ఆ సినిమాలో అదితి చేసిన సాహెబా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా […]

నన్ను ఎవ్వరూ సంప్రదించలేదు
X

తనకు మంచి పాత్ర దొరికితే చాలంటోంది హీరోయిన్ అదితిరావు హైదరీ. తను చేసేది ఓటీటీ సినిమానా, మెయిన్ స్ట్రీమ్ సినిమానా అనే తేడా చూడనంటోంది. తను ఈ విషయాన్ని కొన్ని రోజుల కిందటే ప్రకటించానని, అయినప్పటికీ ఇప్పటివరకు తనకు ఎలాంటి ఓటీటీ ఆఫర్లు రాలేదంటోంది ఈ బ్యూటీ.

నాని-సుధీర్ బాబు నటించిన “వి” అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది అదితిరావు. ఆ సినిమాలో అదితి చేసిన సాహెబా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ఆన్ లైన్లో మీడియాతో మాట్లాడిన అదితి.. వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ ఫిలిమ్స్ లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేసింది.

ప్రస్తుతం తమిళ్ లో 2, హిందీలో 2 సినిమాలు చేస్తోందట అదితి. ఈ లాక్ డౌన్ టైమ్ లో తెలుగులో కూడా ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఆ సినిమా ఏంటనే విషయాన్ని తను చెప్పనని, మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారని అంటోంది. శర్వానంద్-అజయ్ భూపతి కాంబినేషన్ లో రాబోతున్న మహాసముద్రం సినిమాలో అదితి హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉంది.

First Published:  7 Sep 2020 8:30 PM GMT
Next Story