Telugu Global
Cinema & Entertainment

ఓటీటీలోకి వీళ్లు కూడా

త్రివిక్రమ్, కొరటాల, రాజమౌళి లాంటి పెద్ద దర్శకుల్ని మినహాయిస్తే… దాదాపు మిగతా దర్శకులంతా ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. సేఫ్ సైడ్ లో ఓటీటీ అవకాశాలు కూడా ఉంచుకుంటే మంచిదని భావిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే సంకల్ప్ రెడ్డి లాంటి దర్శకులు ఓటీటీ బాట పట్టగా.. తాజాగా మరో ఇద్దరు దర్శకులు ఈ రంగంలోకి అడుగు పెడుతున్నారు. వీరిలో ఒకరు శివ నిర్వాణ కాగా..మరొకరు అజయ్ భూపతి. వీళ్లిద్దరితో నెట్ ఫ్లిక్స్ సంస్థ […]

ఓటీటీలోకి వీళ్లు కూడా
X

త్రివిక్రమ్, కొరటాల, రాజమౌళి లాంటి పెద్ద దర్శకుల్ని మినహాయిస్తే… దాదాపు మిగతా దర్శకులంతా ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. సేఫ్ సైడ్ లో ఓటీటీ అవకాశాలు కూడా ఉంచుకుంటే మంచిదని భావిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే సంకల్ప్ రెడ్డి లాంటి దర్శకులు ఓటీటీ బాట పట్టగా.. తాజాగా మరో ఇద్దరు దర్శకులు ఈ రంగంలోకి అడుగు పెడుతున్నారు.

వీరిలో ఒకరు శివ నిర్వాణ కాగా..మరొకరు అజయ్ భూపతి. వీళ్లిద్దరితో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇద్దరూ కలిసి ఒకటే ప్రాజెక్టు చేస్తారు. కాకపోతే వేర్వేరు ఎపిసోడ్స్ హ్యాండిల్ చేస్తారు. రొమాంటిక్ లవ్ ఎలిమెంట్స్ తో 5 భాగాలుగా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో తొలి రెండు భాగాల్ని వీళ్లిద్దరూ డైరక్ట్ చేయబోతున్నారు.

ప్రేమకథలకు పాపులర్ అయ్యాడు శివ నిర్వాణ. అటు అజయ్ భూపతి కూడా ఆర్ఎక్స్100తో తనమార్క్ లవ్ స్టోరీ చూపించాడు. అందుకే వీళ్లిద్దరికీ ఆఫర్ ఇచ్చింది నెట్ ఫ్లిక్స్.

First Published:  8 Sep 2020 10:00 AM GMT
Next Story