Telugu Global
Health & Life Style

ఈ మందు వాడితే.... ఐసియు అక్కర్లేదు!

కరోనాని ఎదుర్కోవటంలో డి విటమిన్ ప్రధాన పాత్రని పోషిస్తున్నట్టుగా ఇప్పటికే చాలా పరిశోధనలు చెబుతున్నాయి. వైద్యులు సైతం పదేపదే విటమిన్ డి అవసరంపై మాట్లాడుతున్నారు. విటమిన్ డి మనం అనుకున్నదానికంటే మరింత ప్రభావవంతంగా కోవిడ్ 19 ని ఎదుర్కొంటుందని తెలిపే అధ్యయనం ఒకటి స్పెయిన్ లో జరిగింది. విటమిన్ డి కి ఔషధ రూపమైన క్యాల్సిఫిడియోల్ ని ఎక్కువ మోతాదులో వాడటం వలన కోవిడ్ 19 పేషంట్లు… ఐసియు చికిత్స అక్కర్లేకుండానే… అంతవరకు వెళ్లకుండానే కోలుకుంటారని ఈ […]

ఈ మందు వాడితే.... ఐసియు అక్కర్లేదు!
X

కరోనాని ఎదుర్కోవటంలో డి విటమిన్ ప్రధాన పాత్రని పోషిస్తున్నట్టుగా ఇప్పటికే చాలా పరిశోధనలు చెబుతున్నాయి. వైద్యులు సైతం పదేపదే విటమిన్ డి అవసరంపై మాట్లాడుతున్నారు. విటమిన్ డి మనం అనుకున్నదానికంటే మరింత ప్రభావవంతంగా కోవిడ్ 19 ని ఎదుర్కొంటుందని తెలిపే అధ్యయనం ఒకటి స్పెయిన్ లో జరిగింది. విటమిన్ డి కి ఔషధ రూపమైన క్యాల్సిఫిడియోల్ ని ఎక్కువ మోతాదులో వాడటం వలన కోవిడ్ 19 పేషంట్లు… ఐసియు చికిత్స అక్కర్లేకుండానే… అంతవరకు వెళ్లకుండానే కోలుకుంటారని ఈ అధ్యయనంలో తేలింది.

సైన్స్ డైరక్ట్ అనే జర్నల్ లో ఈ అధ్యయన వివరాలను ప్రచురించారు. కోవిడ్ 19తో హాస్పటల్ లో చికిత్స పొందుతున్న 76మందిలో యాభైమందిని ఎంపిక చేసుకుని వారికి క్యాల్సిఫిడియోల్ మందుని ఇచ్చి చికిత్స చేశారు. ఈ మందు ఇచ్చినవారిలో ఒక్కరికి మాత్రమే ఐసియు చికిత్స అవసరం కాగా… మిగిలిన వారంతా క్షేమంగా డిశ్ఛార్జ్ అయిపోయారు. కాగా ఈ మందు ఇవ్వని వారిలో 13 మందికి ఐసియు చికిత్స అవసరమైంది. ఇరువురు మరణించారు.

క్యాల్సిఫిడియోల్ లేదా 25-హైడ్రాక్సివిటమిన్ డి రూపంలో విటమిన్ డిని ఇచ్చినప్పుడు ఆ మందు జీవక్రియల్లో ప్రభావవంతంగా పనిచేస్తుందని… కోవిడ్ 19 పేషంట్లు ఐసియు లో చేరాల్సిన పరిస్థితి రాకుండా నివారిస్తుందని దక్షిణ స్పెయిన్ లోని కార్డోబా నగరంలో ఉన్న రైనా సోఫియా యూనివర్శిటీ హాస్పటల్ లో పనిచేస్తున్న మార్తా ఎంత్రినాస్ క్యాస్టిల్లో అంటున్నారు. మార్తా ఈ అధ్యయనంలో ప్రధాన పాత్ర పోషించారు.

ఈ పరిశోధన ప్రాథమికమైనదని, దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ కోవిడ్ 19 తీవ్రతని క్యాల్సిఫిడియోల్ తగ్గిస్తుందని వారు భావిస్తున్నారు.

క్యాల్సిఫిడియోల్ కచ్ఛితంగా పనిచేస్తుందని రుజువు చేయాలంటే… మరింత ఎక్కువమంది పేషంట్లపై పరిశోధన నిర్వహించాలి. అలాగే అధ్యయనం కోసం ఒకేరకమైన లక్షణాలున్న పేషంట్లు అవసరం అవుతారు. ఒకేరకమైన అనారోగ్య లక్షణాలు ఉన్నవారిని రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూపుకి మందుని ఇచ్చి, మరొక గ్రూపుకి ఇవ్వకుండా అధ్యయనం నిర్వహించాలి. అప్పుడే సరైన ఫలితాలు వచ్చినట్టుగా భావించాలి. ప్రస్తుతం కోవిడ్ 19 పేషంట్లలో మరణాలను తగ్గించడానికి డెక్సామెథాసొన్ అనే స్టెరాయిడ్ ని వాడుతున్నారు.

First Published:  8 Sep 2020 8:50 AM GMT
Next Story