Telugu Global
Cinema & Entertainment

డ్రగ్స్ కేసులో నటి సంజన అరెస్ట్

శాండిల్ వుడ్‌ డ్రగ్స్‌ కేసులో మరో నటి అరెస్ట్ అయ్యారు. నటి సంజనను సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే కన్నడ నటి రాగిణి ద్వివేది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఉదయం సంజన నివాసంలో సీసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. బెంగళూరులోని ఇందిరానగర్‌లోని ఆమె నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి ల్యాప్‌ట్యాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం సీసీబీ ఆఫీస్‌కు తరలించారు. ఇప్పటికే సంజన స్నేహితుడైన రియల్టర్ రాహుల్‌ను […]

డ్రగ్స్ కేసులో నటి సంజన అరెస్ట్
X

శాండిల్ వుడ్‌ డ్రగ్స్‌ కేసులో మరో నటి అరెస్ట్ అయ్యారు. నటి సంజనను సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే కన్నడ నటి రాగిణి ద్వివేది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఉదయం సంజన నివాసంలో సీసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

బెంగళూరులోని ఇందిరానగర్‌లోని ఆమె నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి ల్యాప్‌ట్యాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం సీసీబీ ఆఫీస్‌కు తరలించారు. ఇప్పటికే సంజన స్నేహితుడైన రియల్టర్ రాహుల్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ మాఫియాతో రాహుల్‌కు సంబంధాలున్నట్లు తేలాయి.

సంజన తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. సోగ్గాడు చిత్రం ద్వారా సంజన ఎంట్రీ ఇచ్చారు. బుజ్జిగాడు, యమహో యమ, సర్దార్ గబ్బర్ సింగ్‌ తదితర సినిమాల్లో నటించారు.

First Published:  8 Sep 2020 1:47 AM GMT
Next Story