Telugu Global
Cinema & Entertainment

మహాసముద్రం ముందుకొచ్చింది

శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి డైరెక్షన్ లో మహాసముద్రం సినిమా తెరకెక్కనుందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఎట్టకేలకు ఈ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు మేకర్స్. ఆర్ఎక్స్100 సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి ఎట్టకేలకు రెండో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం క్యాస్టింగ్ తో పాటు […]

మహాసముద్రం ముందుకొచ్చింది
X

శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి డైరెక్షన్ లో మహాసముద్రం సినిమా తెరకెక్కనుందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఎట్టకేలకు ఈ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు మేకర్స్. ఆర్ఎక్స్100 సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి ఎట్టకేలకు రెండో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం క్యాస్టింగ్ తో పాటు లోకేషన్స్ సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడు అజయ్.

సరిలేరు నీకెవ్వరు తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ డెలివరీ చేసిన ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నాడు. మిగతా వివరాలు అతి త్వరలోనే వెల్లడించనున్నారు. ఇదొక మల్టీస్టారర్ మూవీ. శర్వానంద్ తో పాటు మరో హీరో కూడా నటించబోతున్నాడు. మూవీకి సంబంధించి ఇకపై ప్రతివారం ఓ అప్ డేట్ ఇవ్వబోతున్నారు.

First Published:  7 Sep 2020 10:00 PM GMT
Next Story