Telugu Global
National

హైకోర్టులో టీడీపీ వితండవాదం

చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలపై ఏర్పాటైన సిట్‌ను సవాల్‌ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య , ఆలపాటి రాజా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్బంగా హైకోర్టులో ఆసక్తికరమైన వాదనలు జరిగాయి. టీడీపీ ఒక విధంగా వితండవాదమే చేసింది. టీడీపీ హయాంలో జరిగిన వ్యవహారాలపై దర్యాప్తు చేస్తే అది దుష్ట సంప్రదాయానికి దారితీస్తుందని… కాబట్టి దర్యాప్తు చేయడానికి వీల్లేదని వాదించింది. రాజధానిలో 4వేల ఎకరాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పేందుకు ఆధారాలున్నాయని ప్రభుత్వం వాదించినా టీడీపీ మాత్రం […]

హైకోర్టులో టీడీపీ వితండవాదం
X

చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలపై ఏర్పాటైన సిట్‌ను సవాల్‌ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య , ఆలపాటి రాజా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్బంగా హైకోర్టులో ఆసక్తికరమైన వాదనలు జరిగాయి. టీడీపీ ఒక విధంగా వితండవాదమే చేసింది. టీడీపీ హయాంలో జరిగిన వ్యవహారాలపై దర్యాప్తు చేస్తే అది దుష్ట సంప్రదాయానికి దారితీస్తుందని… కాబట్టి దర్యాప్తు చేయడానికి వీల్లేదని వాదించింది.

రాజధానిలో 4వేల ఎకరాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పేందుకు ఆధారాలున్నాయని ప్రభుత్వం వాదించినా టీడీపీ మాత్రం దుష్ట సంప్రదాయం అంటూ వాదించింది. జీవోలను కొట్టివేయాలని కోరింది. అడ్వకేట్ జనరల్ మాత్రం నిబంధనల ప్రకారమే సిట్ ఏర్పాటు జరిగిందని… అక్రమార్కులను కాపాడే ప్రయత్నం ఎవరూ చేయకూడదన్నారు.

టీడీపీ ఇలా పరోక్షంగా తాము తప్పులు చేశామని అంగీకరిస్తూ… సిట్ విచారణ మాత్రం జరగడానికి వీల్లేదని వాదించడం పట్ల న్యాయనిపుణులు ఆశ్చర్యపోతున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానికి దోపిడి చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని వెలికి తీయకూడదా? అలా వెలికి తీస్తే అది దుష్ట సంప్రదాయం అవుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. చూడాలి ఈ కేసులోనూ హైకోర్టులో టీడీపీకే ఊరట లభిస్తుందేమో!.

First Published:  8 Sep 2020 8:52 AM GMT
Next Story