Telugu Global
Cinema & Entertainment

ఆచార్య కోసం రష్మిక....

హీరోలంతా ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్న వేళ.. మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఆచార్య సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా యూనిట్ తో ఆయన చర్చలు ప్రారంభించారు. అయితే మధ్యేమార్గంగా యూనిట్ ఓ ప్లాన్ వేసింది. ఆచార్య సినిమా సెట్స్ పైకి వస్తుంది. కానీ చిరంజీవి సెట్స్ పైకి రారు. చిరంజీవి స్థానంలో రామ్ చరణ్ వస్తాడు. ఈ సినిమాలో చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సో.. చరణ్ […]

ఆచార్య కోసం రష్మిక....
X

హీరోలంతా ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్న వేళ.. మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఆచార్య సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా యూనిట్ తో ఆయన చర్చలు ప్రారంభించారు. అయితే మధ్యేమార్గంగా యూనిట్ ఓ ప్లాన్ వేసింది.

ఆచార్య సినిమా సెట్స్ పైకి వస్తుంది. కానీ చిరంజీవి సెట్స్ పైకి రారు. చిరంజీవి స్థానంలో రామ్ చరణ్ వస్తాడు. ఈ సినిమాలో చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సో.. చరణ్ తో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

అయితే చరణ్ కు ఇప్పటికిప్పుడు హీరోయిన్ కావాలి. సరిగ్గా ఇక్కడే రష్మిక తెరపైకొచ్చింది. దాదాపు 10 నిమిషాల నిడివి ఉండే పాత్ర కోసం రష్మికను తీసుకోవాలనుకుంటున్నారు. చిరంజీవి ఫోన్ చేస్తే రష్మిక కాదనదు. ఎఁదుకంటే.. ఆమెకు చిరంజీవి సెంటిమెంట్.

సో.. రష్మిక ఓకే అంటే ఆచార్య సినిమా వీలైనంత తొందరగా సెట్స్ పైకి వస్తుంది. అటు రష్మిక మిగతా సినిమాలకు ఇబ్బంది కలగకుండా వీలైనంత ఫాస్ట్ గా ఈ షెడ్యూల్ పూర్తిచేస్తారు. ఆ తర్వాత చిరంజీవి సెట్స్ పైకి వస్తారు.

First Published:  8 Sep 2020 10:00 PM GMT
Next Story