Telugu Global
Cinema & Entertainment

మరోసారి బాలయ్య సరసన అంజలి...

బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ఇంకా హీరోయిన్ ఫిక్సవ్వలేదన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ ప్రాజెక్టులో బాలయ్య సరసన ఓ కొత్త హీరోయిన్ ను ఎంపిక చేశారు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా అంజలిని హీరోయిన్ తీసుకోవాలని భావిస్తున్నారట. గతంలో బాలయ్యతో ‘డిక్టేటర్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన అంజలి నే ఇప్పుడు మరోసారి బాలయ్య సరసన హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్సయ్యారని తెలుస్తుంది. కేవలం […]

మరోసారి బాలయ్య సరసన అంజలి...
X

బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ఇంకా హీరోయిన్ ఫిక్సవ్వలేదన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ ప్రాజెక్టులో బాలయ్య సరసన ఓ కొత్త హీరోయిన్ ను ఎంపిక చేశారు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా అంజలిని హీరోయిన్ తీసుకోవాలని భావిస్తున్నారట.

గతంలో బాలయ్యతో ‘డిక్టేటర్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన అంజలి నే ఇప్పుడు మరోసారి బాలయ్య సరసన హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్సయ్యారని తెలుస్తుంది. కేవలం వారం రోజులు షూట్ చేసుకొని కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడిన ఈ సినిమా త్వరలోనే మళ్ళీ షూటింగ్ జరుపుకోనుంది. అప్పుడు అంజలిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే టైటిల్ ప్రకటించనున్నారు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

First Published:  8 Sep 2020 8:30 PM GMT
Next Story