Telugu Global
National

ఏపీ సచివాలయంలో మళ్లీ వాస్తు మార్పులు !

ఏపీ సచివాలయం ఏ ముహూర్తాన కట్టారో తెలియదు. కట్టినప్పటి నుంచి సచివాలయానికి మార్పులు తప్పడం లేదు. తాజాగా మళ్లీ వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. రెండు నెలలుగా సచివాలయంలో మార్పులు కొనసాగుతున్నాయి. జూన్ నెలాఖరున సచివాలయంలో రెండు గేట్లు, అసెంబ్లీలో మరో గేటును మూసివేశారు. గేటుకు అడ్డంగా గోడ నిర్మాణం చేశారు. తాజాగా సచివాలయంలో ఒక గేటు, అసెంబ్లీలో మరో గేటును గోడకట్టి మూసివేశారు. ఇప్పటివరకూ మొత్తం ఐదు గేట్లు మూసివేశారు. అసెంబ్లీలోకి వెళ్లేందుకు మొత్తం ఐదు […]

ఏపీ సచివాలయంలో మళ్లీ వాస్తు మార్పులు !
X

ఏపీ సచివాలయం ఏ ముహూర్తాన కట్టారో తెలియదు. కట్టినప్పటి నుంచి సచివాలయానికి మార్పులు తప్పడం లేదు. తాజాగా మళ్లీ వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. రెండు నెలలుగా సచివాలయంలో మార్పులు కొనసాగుతున్నాయి.

జూన్ నెలాఖరున సచివాలయంలో రెండు గేట్లు, అసెంబ్లీలో మరో గేటును మూసివేశారు. గేటుకు అడ్డంగా గోడ నిర్మాణం చేశారు. తాజాగా సచివాలయంలో ఒక గేటు, అసెంబ్లీలో మరో గేటును గోడకట్టి మూసివేశారు. ఇప్పటివరకూ మొత్తం ఐదు గేట్లు మూసివేశారు.

అసెంబ్లీలోకి వెళ్లేందుకు మొత్తం ఐదు గేట్లు ఉన్నాయి. వీటిలో రెండు మూసివేశారు. సచివాలయానికి 8 ఎంట్రీ గేట్లు ఉండేవి. వీటిలో ఐదు మాత్రమే తెరిచి ఉంచారు. మూడు మూసివేశారు. ఈ ఐదుగేట్లలో కూడా ఇప్పటికే రెండు గేట్లు ఉపయోగంలో లేవు. దీంతో ఇప్పుడు మూడు గేట్ల నుంచి మాత్రమే సచివాలయంలోకి వెళ్లేందుకు వీలు ఉంది.

First Published:  9 Sep 2020 2:54 AM GMT
Next Story