Telugu Global
International

సైడ్ ఎఫెక్ట్స్‌... ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేత

కరోనా కోసం తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిలిపివేశారు. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తికి సైడ్‌ ఎఫెక్ట్స్ రావడంతో ట్రయల్స్‌ను ఆపేశారు. వ్యాక్సిన్ తీసుకున్న బ్రిటన్ వ్యక్తి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌ జరుపుకుంటోంది. సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా మూడో దశ ట్రయల్స్‌ను ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నిలిపివేసింది. కరోనాను ఎదుర్కొంనేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ కలిసి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం […]

సైడ్ ఎఫెక్ట్స్‌... ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేత
X

కరోనా కోసం తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిలిపివేశారు. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తికి సైడ్‌ ఎఫెక్ట్స్ రావడంతో ట్రయల్స్‌ను ఆపేశారు. వ్యాక్సిన్ తీసుకున్న బ్రిటన్ వ్యక్తి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతున్నాడు.

ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌ జరుపుకుంటోంది. సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా మూడో దశ ట్రయల్స్‌ను ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నిలిపివేసింది. కరోనాను ఎదుర్కొంనేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ కలిసి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి.

ప్రస్తుతం పలు దేశాల్లో ఈ టీకాను ట్రయల్స్‌లో భాగంగా ప్రయోగిస్తున్నారు. బ్రిటన్‌లో ఈ టీకా తీసుకున్న వ్యక్తి అనారోగ్యానికి గురవడంతో తాత్కాలికంగా ట్రయల్స్‌ను ఆపేశారు. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.

First Published:  8 Sep 2020 11:38 PM GMT
Next Story