Telugu Global
National

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై రామకృష్ణ దాటవేత... వినపడలేదంటూ ఎస్కేప్

సీపీఐ రామకృష్ణ ఒక చానల్ నిర్వహించిన చర్చలో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. పేదలకు స్థానం ఇవ్వని అమరావతిలో అసలు శాసన రాజధాని కూడా ఉండడానికి వీల్లేదన్న కొడాలి నాని వ్యాఖ్యలపై చర్చ నిర్వహించగా…రామకృష్ణ అందులో పాల్గొన్నారు. ఎప్పటిలాగే అమరావతిలోనే రాజధాని ఉండాలని రామకృష్ణ బలంగా వాదించారు. ఇంతలో అమరావతిలో 55వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మీరేమంటారు అని ప్రశ్నించగా రామకృష్ణ సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు […]

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై రామకృష్ణ దాటవేత... వినపడలేదంటూ ఎస్కేప్
X

సీపీఐ రామకృష్ణ ఒక చానల్ నిర్వహించిన చర్చలో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. పేదలకు స్థానం ఇవ్వని అమరావతిలో అసలు శాసన రాజధాని కూడా ఉండడానికి వీల్లేదన్న కొడాలి నాని వ్యాఖ్యలపై చర్చ నిర్వహించగా…రామకృష్ణ అందులో పాల్గొన్నారు. ఎప్పటిలాగే అమరావతిలోనే రాజధాని ఉండాలని రామకృష్ణ బలంగా వాదించారు.

ఇంతలో అమరావతిలో 55వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మీరేమంటారు అని ప్రశ్నించగా రామకృష్ణ సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలంటూ తనకు తోచిన విధంగా మాట్లాడారు. అసలు తమ అభిప్రాయాన్ని ఎవరు కోరారు అని ప్రశ్నించారు.

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని స్టే తెచ్చిన వారి ఉద్యమానికి కమ్యూనిస్టులు ఎలా మద్దతు ఇస్తున్నారని యాంకర్ ప్రశ్నించగా… వీలైనంత వరకు ఆ అంశాన్ని దాటవేసేందుకు రామకృష్ణ ప్రయత్నించారు. రాజధాని అక్కడే ఉండాలన్నది తమ కోరిక అని చెప్పారు.

ఇంతలో వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున… పేదల కోసం ఉద్యమాలు చేసిన కమ్యూనిస్టులు అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీపై సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో రామకృష్ణ ఆగ్రహించారు. ముందు ఇప్పటికే కట్టిన ఇళ్లను పంపిణీ చేసి ఆ తర్వాత మిగిలిన వాటి గురించి మాట్లాడండి అంటూ ఎదురుదాడి చేశారు రామకృష్ణ.

మరోసారి యాంకర్ జోక్యం చేసుకుని మిగిలిన రాష్ట్రంలో సంగతి కాసేపు పక్కన పెడదాం… అమరావతిలో 55వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో మంచి ఉందా లేదా సూటిగా చెప్పండి అని మరోసారి రామకృష్ణను ప్రశ్నించారు. ఈసారి సీపీఐ రామకృష్ణ తనకు ఏమీ వినిపించడం లేదని… మైక్ పనిచేయడం లేదని తప్పించుకున్నారు.

First Published:  8 Sep 2020 11:41 PM GMT
Next Story