మారుతికి హీరో దొరికాడోచ్

ఈ లాక్ డౌన్ 4 నెలల కాలంలో 2 కథలు రాసుకున్నాడు మారుతి. హీరో సెట్ అయితే, తను రాసుకున్న 2 కథల్లో ఆ హీరోకు నచ్చిన కథతో సెట్స్ పైకి వెళ్లాలనేది మారుతి ప్లాన్. కానీ దర్శకులంతా ఆల్రెడీ స్టార్ హీరోల్ని లాక్ చేశారు.

స్టార్ హీరోల నుంచి ఓ మోస్తరు హీరోల వరకు అంతా మినిమం రెండేసి సినిమాల్ని లైన్లో పెట్టారు. దీంతో మారుతికి హీరో దొరకడం కష్టంగా మారింది. ఎట్టకేలకు మారుతి వెదుకులాట ఫలించినట్టు కనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా మారుతి కొత్త సినిమా వచ్చే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం అల్లుడు అదుర్స్ అనే సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ. లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూట్ ఆగిపోయింది. అది కంప్లీట్ అయిన వెంటనే మారుతి-బెల్లంకొండ కాంబినేషన్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.