Telugu Global
National

స్కూల్లో బెంచీలు కాదు... టెంటులు !

ఇప్పుడు మనమంతా ఒక యుద్ధవాతావరణంలోనే బతుకుతున్నాం. కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నాం. కనిపించే శత్రువుతో కంటే కనిపించని శత్రువుతో పోరాటం చేయటం మరింత కష్టం.  మన చుట్టూ వైరస్ ఉందో లేదో తెలియకపోయినా మాస్కులు వేసుకోవాల్సిందే… చేతులు కడుక్కుంటూ ఉండాల్సిందే. ఇలాంటి స్థితిలో స్కూళ్లను ప్రారంభించడం, ఆన్ లైన్లో కాకుండా ప్రత్యక్ష్యంగా చిన్నపిల్లలకు చదువు చెప్పటం నిజంగా ఒక సాహసమనే చెప్పాలి. ఇరాన్ లో నెల ఐదో తేదీ నుండి స్కూళ్లు ప్రారంభించారు. 15 మిలియన్ల […]

స్కూల్లో బెంచీలు కాదు... టెంటులు !
X

ఇప్పుడు మనమంతా ఒక యుద్ధవాతావరణంలోనే బతుకుతున్నాం. కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నాం. కనిపించే శత్రువుతో కంటే కనిపించని శత్రువుతో పోరాటం చేయటం మరింత కష్టం. మన చుట్టూ వైరస్ ఉందో లేదో తెలియకపోయినా మాస్కులు వేసుకోవాల్సిందే… చేతులు కడుక్కుంటూ ఉండాల్సిందే. ఇలాంటి స్థితిలో స్కూళ్లను ప్రారంభించడం, ఆన్ లైన్లో కాకుండా ప్రత్యక్ష్యంగా చిన్నపిల్లలకు చదువు చెప్పటం నిజంగా ఒక సాహసమనే చెప్పాలి.

ఇరాన్ లో నెల ఐదో తేదీ నుండి స్కూళ్లు ప్రారంభించారు. 15 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలలకు వెళుతున్నారు. కరోనా నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఉంటారని వేరే చెప్పాల్సిన పనిలేదు కదా. ఫర్నాజ్ ఫాస్సిహీ అనే జర్నలిస్టు ఒక తరగతి గది తాలూకూ ఫొటోని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అదొక అనూహ్యమైన దృశ్యమనే చెప్పాలి. సాధారణంగా స్కూళ్లలో బెంచీలు ఉంటాయి కదా… కానీ ఆ ఫొటోలో… తరగతి గదిలో పిల్లలు చిన్నపాటి టెంట్లలో కూర్చుని ఉన్నారు. ఎవరి టెంటు వారిదే. టెంట్లు పారదర్శకంగా ఉండటం వలన వాళ్లు టీచరుని చూడవచ్చు… పాఠాలను వినవచ్చు. పిల్లలు ఎవరూ మాస్కులు ధరించలేదు.

టెంట్లలో కూర్చుని చదువుకుంటున్న బాలల చిత్రం ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. చాలామంది ఈ వినూత్న ఉపాయాన్ని అభినందిస్తున్నారు. అయితే మూసి ఉన్న టెంటులో చాలా సమయం పాటు కూర్చోవటం వలన పిల్లల ఆరోగ్యానికి హాని కలుగుతుందనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

కరోనా ఇప్పుడప్పుడే పోదని… అది మనతోనే చాలాకాలం పాటు ఉంటుందని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో మన జీవనశైలిలో ఇలాంటి వైవిధ్యభరితమైన మార్పులు ఇంకెన్ని చోటు చేసుకుంటాయో కదా… !

First Published:  9 Sep 2020 9:50 AM GMT
Next Story