Telugu Global
National

నారా లోకేష్ ప్రతీకార ప్రగల్భాలు...

వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే.. మొత్తం 40మంది వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టి లోపలేయిస్తాం అంటూ భవిష్యవాణి చెప్పారు మాజీ మంత్రి నారా లోకేష్. వడ్డీతో సహా చెల్లిస్తామని, తమ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులేవీ మర్చిపోయే ప్రసక్తే లేదని అన్నారు. జైలుకెళ్లొచ్చిన మాజీ మంత్రులను పరామర్శించి తండ్రి చంద్రబాబు హైదరాబాద్ తిరిగి వెళ్లగానే ఆయన తనయుడు విజయవాడ వచ్చారు. కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి మాట్లాడిన అనంతరం ఆవేశంతో ఊగిపోతూ మీడియా ముందుకొచ్చారు. ఇంతకు ఇంత […]

నారా లోకేష్ ప్రతీకార ప్రగల్భాలు...
X

వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే.. మొత్తం 40మంది వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టి లోపలేయిస్తాం అంటూ భవిష్యవాణి చెప్పారు మాజీ మంత్రి నారా లోకేష్. వడ్డీతో సహా చెల్లిస్తామని, తమ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులేవీ మర్చిపోయే ప్రసక్తే లేదని అన్నారు.

జైలుకెళ్లొచ్చిన మాజీ మంత్రులను పరామర్శించి తండ్రి చంద్రబాబు హైదరాబాద్ తిరిగి వెళ్లగానే ఆయన తనయుడు విజయవాడ వచ్చారు. కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి మాట్లాడిన అనంతరం ఆవేశంతో ఊగిపోతూ మీడియా ముందుకొచ్చారు. ఇంతకు ఇంత వడ్డీతో చెల్లిస్తామని చెప్పుకొచ్చారు లోకేష్. టీడీపీ ప్రభుత్వంపై నిందలేశారు కానీ, అవినీతి జరిగిందని వైసీపీ నిరూపించలేకపోయిందని, కేవలం ఆరోపణలతోనే అరెస్ట్ ల పర్వం కొనసాగిందని మండిపడ్డారు.

అయితే తమ వద్ద వైసీపీ ఎమ్మెల్యేలందరి జాతకం ఉందని, హీనపక్షం ఇప్పుడున్న 40మంది ఎమ్మెల్యేలు వచ్చే దఫా జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు. వారితోపాటు వందలమంది అధికారులు కూడా జైలుకెళ్లడం ఖాయమని అన్నారు లోకేష్. మంత్రుల్లో అసహనం పెరిగిపోయి బూతులు మాట్లాడుతున్నారని, జగన్ పేరు చెప్పుకోలేక పదే పదే చంద్రబాబు పేరు జపిస్తున్నారంటూ మండిపడ్డారు.

వైజాగ్ లో ఇడుపులపాయ రౌడీలు తిష్టవేశారని, వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిస్తే వైజాగ్ లో వాస్తు బాగోలేదు, రాజధాని కడపకు మారుస్తామని అంటారని చెప్పారు. వైసీపీ తరపున 151మంది ఎమ్మెల్యేలు గెలిచి కనీసం స్పెషల్ స్టేటస్ కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. గతంలో సీబీఐని ఏపీలో అడుగుపెట్టనిచ్చేది లేదని చెప్పిన లోకేష్.. అదే నోటితో నేడు సీబీఐ ఎంక్వయిరీ కావాలని డిమాండ్ చేశారు.

హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని, వైసీపీ వచ్చాక అన్యమత ప్రచారం బాగా పెరిగిందని అన్నారు. మామయ్య బాలకృష్ణ లాగా మీసం మెలేయడం, తొడగొట్టడం చేయలేదు కానీ.. ఆయనకంటే ఎక్కువగా సినిమా డైలాగులు వల్లెవేసి తన పరామర్శ యాత్రను రక్తి కట్టించారు నారా లోకేష్. మరోసారి వైసీపీ నేతల నోటికి పని కల్పించి వెళ్లిపోయారు.

First Published:  9 Sep 2020 9:53 AM GMT
Next Story