Telugu Global
CRIME

‘చిన్నారి పెళ్లి కూతురు’ బామ్మకు... బ్రెయిన్ స్ట్రోక్ !

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్లో బామ్మ పాత్రలో నటించిన సురేఖ సిక్రీ బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు. ముంబయిలోని క్రిటికల్ కేర్ హాస్పటల్ లో ఐసియులో చికిత్స పొందుతున్నారు. సురేఖ వయసు 75 సంవత్సరాలు. నెట్ ఫ్లిక్స్ లో ఘోస్ట్ స్టోరీస్ లో  చివరిసారిగా కనిపించారామె. నాలుగు దశాబ్దాల కెరీర్ లో సురేఖ… టీవీ సీరియల్స్ లోనే కాకుండా తమస్, మమ్మో, సర్దారీ బేగం, రైన్ కోట్ లాంటి సినిమాల్లోనూ నటించారు. మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. తెలుగులో […]

‘చిన్నారి పెళ్లి కూతురు’ బామ్మకు... బ్రెయిన్ స్ట్రోక్ !
X

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్లో బామ్మ పాత్రలో నటించిన సురేఖ సిక్రీ బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు. ముంబయిలోని క్రిటికల్ కేర్ హాస్పటల్ లో ఐసియులో చికిత్స పొందుతున్నారు. సురేఖ వయసు 75 సంవత్సరాలు. నెట్ ఫ్లిక్స్ లో ఘోస్ట్ స్టోరీస్ లో చివరిసారిగా కనిపించారామె. నాలుగు దశాబ్దాల కెరీర్ లో సురేఖ… టీవీ సీరియల్స్ లోనే కాకుండా తమస్, మమ్మో, సర్దారీ బేగం, రైన్ కోట్ లాంటి సినిమాల్లోనూ నటించారు. మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు.

తెలుగులో చిన్నారి పెళ్లి కూతురిగా వచ్చిన బాలికా వధు… సీరియల్ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా ఆమె కుటుంబ సభ్యులు తెలిపారని సురేఖ మేనేజర్ వివేక్ వెల్లడించారు. వైద్య ఖర్చుల కోసం అవసరమైతే… ఆమె సహనటులను సహాయం అడిగే అవకాశం ఉందని అతను తెలిపాడు.

ఇంతకుముందు 2018లో కూడా సురేఖకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అప్పట్లో ఆమెకు పక్షవాతం రాగా తరువాత కోలుకున్నారు. అప్పటినుండి తనను నిరంతరం కనిపెట్టుకుని ఉండేలా ఒక నర్సుని నియమించుకున్నారామె. ఆ నర్సే ప్రస్తుతం ఆమెని హాస్పటల్ లో చేర్చింది. ఇంతకంటే మంచి హాస్పటల్లో చేర్చేందుకు తగినంత డబ్బు తమ వద్ద లేదని, ఆమెతో పనిచేసిన నటీనటులు సురేఖని ఆదుకోవాల్సిందిగా ఆ నర్సు అభ్యర్థించారు.

2018లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తరువాత సురేఖ నిదానంగా కోలుకుంటూ వచ్చారు. ఆ తరువాత నటించాలనుకునేసరికి కరోనా కారణంగా షూటింగ్స్ లేకుండా పోయాయి. ఆ సమయంలో సురేఖ సిక్రి తన బాధని వ్యక్తం చేశారు. పెద్ద వయసు వారిని బయటకు రావద్దని అంటున్నారని, తన వైద్య ఖర్చులు నెలకు రెండు లక్షలు అవుతున్నాయని, రాజ్యాంగపరంగా ఆరోగ్యం కాపాడుకునే హక్కు తనకు లేకుండా పోయిందని ఆమె వాపోయారు. ‘నన్ను షూటింగ్ లకే వెళ్లవద్దంటే ఎలా… పనిచేసే శక్తి ఉన్నా చేయవద్దనటం చాలా అన్యాయం. నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి’ అంటూ అప్పట్లో ఎంతో ఆవేదన చెందారామె.

First Published:  8 Sep 2020 8:10 PM GMT
Next Story